Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ స్టార్ దూకుడు... మరో కొత్త ప్రాజెక్టుపై ఫోకస్!

Webdunia
ఆదివారం, 25 అక్టోబరు 2020 (17:34 IST)
జోడు గుర్రాలపై స్వారీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు దూకుడు పెంచాడు. అటు రాజకీయాల్లో, ఇటు సినిమా రంగాలను ఏలేలా ఆయన తన ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇందులోభాగంగా, కొత్త మూవీ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపుతూ సాగిపోతున్నారు. 
 
ఇప్పటికే బాలీవుడ్ చిత్రం పింక్ రీమేక్‌ను తెలుగులోకి వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇపుడు హైదరాబాద్ నగరంలో సాగుతోంది. ఈ చిత్రం షూటింగ్ ఇంకా ముగియముందే ఆయన దర్శకులు క్రిష్ జాగర్లమూడి, హరీష్ శంకకర్, సురేందర్ రెడ్డిలతో కలిసి పని చేసేందుకు సమ్మతించారు. 
 
తాజాగా పవన్ చేస్తున్న మరో సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడింది. సితార ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించనున్నాడు. మలయాళంలో హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్'కు రీమేక్‌గా ఈ చిత్రం నిర్మితంకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments