Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

డీవీ
శనివారం, 23 నవంబరు 2024 (18:12 IST)
Pawan Kalyan, Harihara Veeramallu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రాల్లో "హరిహర వీరమల్లు" ఒకటి. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్ ఒకటి వచ్చేసింది. రెండు భాగాలుగా వున్న ఈ సినిమాను మార్చి 28, 2025న థియేటర్లలోకి దూసుకెళ్ళనున్నామని చిత్ర యూనిట్ నేడు ప్రకటన చేసింది. దానికి సంబంధించిన గ్లింప్స్ ను కూడా విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ శూలంతో నడుచుకుంటూ వచ్చి కుడిచేతితో తిప్పుతున్న గ్లింప్స్ ఆకట్టుకుంది.
 
 ఈ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. కనుక కొంత భాగాన్ని తీయాలని ప్రయత్నించారు నిర్మాత దర్శకుడు. కానీ రాజకీయాల వల్ల బిజీగా వుండడంతో అరకొర షూటింగ్ తో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. దానితో షూటింగ్ పనులు సాగుతున్నాయోలేదో అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 
 
 "మీ ముందుకు ధర్మం కోసం యుద్ధం త్వరలో..." అంటూ గతంలోనే పవన్ కళ్యాణ్‌ ఫోటోతో  పోస్టర్‌ను రూపొందించారు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా నిధి అగర్వాల్.  బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ వంటి దిగ్గజ నటులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం. మెగా సూర్యా ప్రొడక్షన్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

ఇద్దరి పిల్లల్ని కట్టేసి మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్, క్లీనర్

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments