గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

డీవీ
శనివారం, 23 నవంబరు 2024 (17:36 IST)
Vijay Antony, Ajay Dhishan
విజయ్ ఆంటోని ప్రస్తుతం మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ ‘గగన మార్గన్’ అనే సినిమాను చేస్తున్నారు. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, మీరా విజయ్ ఆంటోని సమర్పిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇది వరకు రిలీజ్ చేసిన విజయ్ ఆంటోనీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.
 
ఈ చిత్రంలో విజయ్ ఆంటోని మేనల్లుడు (సోదరి కొడుకు) అజయ్ ధీషన్‌ను విలన్‌గా పరిచయం చేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్‌ను చూస్తుంటే విజయ్ ఆంటోనీ, అజయ్‌ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండేలా కనిపిస్తోంది. ఈ రెండు పాత్రలు తలపడే సీన్లు ప్రేక్షకులకు ఆడ్రినలిన్ రష్‌ ఇచ్చేలా ఉంది.
 
సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషించారు.
 
యువ.ఎస్ సినిమాటోగ్రఫర్‌గా, విజయ్ ఆంటోని స్వయంగా సంగీతం సమకూర్చుతుండగా.. రాజా.ఎ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
 
"గగన మార్గన్" అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే హృద్యమైన కుటుంబ చిత్రంగా రాబోతోంది. త్వరలో థియేటర్లలోకి ఈ సినిమాను తీసుకొచ్చేందుకు యూనిట్ సిద్ధంగా ఉంది.
 
తారాగణం: విజయ్ ఆంటోని, అజయ్ ధీషన్, సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి మరియు అంతగారం నటరాజన్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

Nara Lokesh: విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి.. సామాజిక మార్పుకు సహకరించాలి..

ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన ఓటు హక్కు ఇవ్వాలా? సుప్రీంకోర్టు ప్రశ్న

సుమత్రా దీవుల్లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments