Webdunia - Bharat's app for daily news and videos

Install App

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

దేవీ
సోమవారం, 9 జూన్ 2025 (12:48 IST)
OG- Pawankalyan
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ఓజీ సినిమా షూటింగ్ విజయవాడలో జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు నిన్నటితో పవన్ షెడ్యూల్ పూర్తయినట్లు తెలిసింది. షూటింగ్ లో చాలా సరదాగా చేతిలో రింగ్ తిప్పుకుంటూ డాన్స్ చేస్తూ కనిపించారట. మామూలుగా పవన్ దగ్గరకు వెళ్లడానికి జంకుతారు. కానీ షూటింగ్ ఆఖరిరోజున చిత్ర టీమ్ అంతా కలిసి ఆయనతో ఫొటో దిగి తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు.
 
విశేషం ఏమంటే, ఆ షూటింగ్ సమయంలోనే దర్శకుడు హరీష్ శంకర్ కూడా  పాల్గొన్నారు. బ్రేక్ టైంలో ఆయనతో పవన్ కళ్యాణ్ చర్చించుకునేవారు. తాజా సమాచారం మేరకు 45రోజులపాటు ఉస్తాద్ గబ్బర్ సింగ్ కొనసాగింపు షూటింగ్ చేయడానికి సమయం ఇచ్చినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్, అమరావతి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ కు ప్లాన్ చేసుకోమని పవన్ సూచించినట్లు సమాచారం. అతి త్వరలో ఈ సినిమా గురించి ప్రకటన రాబోతుంది. 
 
ఇదిలా వుండగా, ఇప్పటికే హరి హర వీర మల్లు విడుదలకు సిద్ధమైనా, సాంకేతికతవల్ల జులై 4న సినిమా విడుదలచేయాలని నిర్మాత ఎ.ఎం. రత్నం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓజీ షెడ్యూల్ కూడా పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. దర్శకుడు సాగర్ ఈ సినిమాపై మంచి హోప్స్ లో వున్నాడు. DVV ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీత దర్శకుడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి : పవన్‌కు సీఎం బాబు విషెస్

సీఈవో పోస్టుకు ఎసరు పెట్టిన ఉద్యోగితో ప్రేమ!!

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments