Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం : పవన్ భావోద్వేగ ప్రకటన

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2020 (16:10 IST)
ఆగస్టు 22వ తేదీ.. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ యేడాది వినాయక చవితి కూడా ఇదే రోజు వచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్‌కు రెండు పండుగలు వచ్చినట్టయింది. అయితే, తన అన్నయ్య చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని జనసేన పార్టీ అధినేత, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. తన అన్నయ్య మీద ఉన్న ప్రేమను తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
చిరంజీవికి తమ్ముడిగా పుట్టడం తన అదృష్టమని ఆని ఎమోషనల్‌ అయ్యారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అసామన్యుడిగా ఎదిగి, తనలాంటి ఎందరికో స్ఫూర్తిప్రధాతగా నిలిన వ్యక్తి చిరంజీవి అని​ కొనియాడారు. చిరంజీవి తనకు కేవలం అన్నయ్యే కాకుండా దైవంతో సమానమని వెల్లడిస్తూ జన్మదిన శుభాకాంక్షలు అందించారు.
 
అన్నయ్య చేయిపట్టి పెరిగానని, ఆయనే తన తొలిగురువు అని పవన్‌ గుర్తుచేసుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి కొట్లాది మంది అభిమానులు, శ్రేయోభిలాషుల గుండెల్లో చిరస్మరమైన స్థానాన్ని సంపాదించిన గొప్ప వ్యక్తి చిరంజీవి అని పొగిడారు. ఆయన ఎదుగుదల ఆయనలోని సేవా తత్పరతను ఆవిష్కరింపజేసిందన్నారు. 
 
ఆయనలా నటుడవుదామని, ఆయనలా అభినయించాలని కొందరు స్ఫూర్తి పొందితే, ఆయన సేవ చేయాలని మరెందరో ప్రేరణ పొందారని పవన్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆయన అభిమానులకు సేవ అనే సత్కార్యానికి దారి చూపారు. ఎందరో ఆ దారిలో పయనిస్తూ నేడు సమాజంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆపన్నులకు అండగా ఉంటున్నారు. 
 
అటువంటి కృషీవలుడికి తప్పుడిగా పుట్టడం నా అదృష్టం. నేడు చిరంజీవి జన్మదినం. ఈ సందర్భంగా ఆయనను తెలుగువారందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాు. ఆయనకు చిరాయువుతో కూడిన సుఖశాంతులు ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అన్నయ్యకు ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరి 1, 2025 నుండి ఇండోర్ యాచిస్తే ఎఫ్ఐఆర్ నమోదు..

డిసెంబరు 17 నుండి 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పర్యటన

కెనడా రాజకీయాల్లో సంచలనం - ఉప ప్రధాని క్రిస్టియా రాజీనామా

పురిటి నొప్పులు వచ్చినా గ్రూప్-2 పరీక్షలు రాసింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

అత్తగారి ఊరిలో 12 ఇళ్లకు కన్నం వేసిన భలే అల్లుడు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments