Webdunia - Bharat's app for daily news and videos

Install App

"హరిహర వీరమల్లు"కు పవన్ కళ్యాణ్ - జస్ట్ 4 గంటల్లో డబ్బింగ్ పూర్తి

ఠాగూర్
గురువారం, 29 మే 2025 (16:07 IST)
తన కొత్త చిత్రం "హరిహర వీరమల్లు"కు హీరో పవన్ కళ్యాణ్ డబ్బింగ్ పనులు పూర్తి చేశారు. వచ్చే నెల 12వ తేదీన చిత్రం విడుదలకానుంది. దీంతో ఒకవైపు తుది దశ నిర్మాణ పనులు, మరోవైపు, ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను పవన్ కళ్యాణ్ పూర్తి చేశారు. 
 
తన బిజీ షెడ్యూల్‌లోనూ రాత్రి 10 గంటలకు డబ్బింగ్ మొదలుపెట్టి నాలుగు గంటల్లోనే పూర్తి చేసినట్టు వెల్లడించారు. డబ్బింగ్ పనులకు సంబంధించిన ఫోటోలను చిత్రం బృందం అభిమానుల కోసం షేర్ చేసింది. 'పవర్ స్టార్మ్‌'కి సిద్ధంగా ఉండండి. జూన్ 12వ తేదీన సినిమా థియేటర్లలో కలుద్దాం అంటూ రాసుకొచ్చారు. 
 
కాగా, ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు. తొలి భాగం ''హరిహర వీరమల్లు - స్వార్డ్ వర్సెస్ స్పిరిట్" పేరుతో తెరకెక్కించగా, జూన్ 12వ తేదీన విడుదల చేస్తున్నారు. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ నటించగా, ఇతర పాత్రల్లో అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నోరా ఫతేరా, విక్రమ్ జీత్, సునీల్, నాజర్, కబీర్  సింగ్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలను పోషించారు. 
 
ప్రముఖ బడా నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జ్యోతి కృష్ణ దర్శకత్వం. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీత స్వరాలు సమకూర్చారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంట గ్యాస్ సిలిండర్ పేలుడు : ఒకరు మృతి - ముగ్గురికి గాయాలు

వివేకా హత్య కేసు విచారణ పూర్తయింది : సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ

భార్యాభర్తలపై కాల్పులు జరిపిన ప్రేమికుడు.. నన్ను కాదని అతడితో వెళ్తావా?

జమ్మూకాశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ?వార్తలను ఖండించిన సీఎం ఒమర్

తిరుమల బాల గంగమ్మ ఆలయం వద్ద చిరుత సంచారం.. పిల్లి చిక్కలేదు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments