Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సైరా'లో అన్నయ్య అదరగొట్టాడు.. థియేటర్‌లో చూసేందుకు రెడీగా ఉన్నా : పవన్ కళ్యాణ్

తన అన్న మెగాస్టార్ చిరంజీవికి జనసేన అధిపతి, హీరో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం చిరంజీవి తన 63వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్న విషయం తెల్సిందే.

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (11:34 IST)
తన అన్న మెగాస్టార్ చిరంజీవికి జనసేన అధిపతి, హీరో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం చిరంజీవి తన 63వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్న విషయం తెల్సిందే.
 
ఈ పుట్టిన రోజుకు ఒక్కరోజు ముందు అంటే ఆగస్టు 21వ తేదీన చిరంజీవి నటించిన తాజా చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌ విడుదల కాకముందు తొలిసారి చూసింది పవన్ కళ్యాణ్ కావడం గమనార్హం. 
 
ఈ టీజర్ అద్భుతమైన విజువల్, సౌండ్ ఎఫెక్ట్స్‌తో ఉన్న ఈ టీజర్ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. టీజరే ఈ రేంజ్‌లో ఉంటే... సినిమా ఇంకెంత రేంజ్‌లో ఉంటుందో అనే అంచనాలు పెరిగిపోయాయి.
 
మరోవైపు, ఈ టీజర్‌కు సంబంధించి ఈ సినిమాను నిర్మిస్తున్న చిరు తనయుడు రామ్ చరణ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. 'సైరా' టీజర్‌ను చూసిన మొదటి వ్యక్తి తన బాబాయ్ పవన్ కల్యాణ్ అని తెలిపాడు. టీజర్‌ను విడుదల చేసే రోజు ఫైనల్ ఔట్ పుట్ తనకు ఉదయం 10.45 గంటలకు వచ్చిందని, వెంటనే దాన్ని తాను బాబాయ్‌కి ఫార్వర్డ్ చేశానని చెప్పాడు. 
 
ఆ తర్వాత 11.10 గంటలకు బాబాయ్ నుంచి తనకు రిప్లయ్ వచ్చిందని... 'టీజర్ అదిరిపోయింది... థియేటర్‌లో చూసేందుకు రెడీ అవుతున్నాను' అని బాబాయ్ చెప్పారని చరణ్ తెలిపాడు. దీంతో సైరాపై సినీ అభిమానుల్లో మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments