Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నటుడు శ్రీహరి భార్యకు జనసేనాని ఆహ్వానం...?

శ్రీహరి. ఈయన గురించి అస్సలు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు శ్రీహరి. ఆయన నటించిన సినిమాలు ఎన్నో విజయవంతంగా ప్రదర్శించబడ్డాయి. కొంతమంది అభిమానులు హీరో ఎవరు అనే దానికన్నా శ్రీహరి నటించ

నటుడు శ్రీహరి భార్యకు జనసేనాని ఆహ్వానం...?
, గురువారం, 16 ఆగస్టు 2018 (15:48 IST)
శ్రీహరి. ఈయన గురించి అస్సలు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు శ్రీహరి. ఆయన నటించిన సినిమాలు ఎన్నో విజయవంతంగా ప్రదర్శించబడ్డాయి. కొంతమంది అభిమానులు హీరో ఎవరు అనే దానికన్నా శ్రీహరి నటించిన సినిమా అయితే చాలనుకునేవారు లేకపోలేదు. అంతటి పేరును సంపాదించుకున్నారు. శ్రీహరి సినీ పరిశ్రమలో ఉన్నప్పుడే శాంతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.
 
శాంతిని సినీ పరిశ్రమలో డిస్కో శాంతి అంటుంటారు. శాంతి అన్న దానికన్నా డిస్కో శాంతి అంటే ప్రేక్షకులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. అనారోగ్య సమస్యలతో శ్రీహరి మరణించిన తరువాత ఎన్నో ఒడిదుడికులను ఎదుర్కొన్నారు ఆయన భార్య శాంతి. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆమె రాజకీయాల్లోకి వెళ్ళాలనుకునే ఆలోచనలో ఉన్నారట. విషయం కాస్తా జనసేనాని పవన్ కళ్యాణ్‌ దృష్టికి వెళ్ళిందట. 
 
మొదట్లో డిస్కో శాంతినే స్వయంగా పవన్‌కు ఫోన్ చేసి ఆ తరువాత సైలెంట్ అయిపోయారట. కానీ ఇప్పుడు పవన్ స్వయంగా డిస్కో శాంతికి ఫోన్ చేసి పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారట. ఇప్పటికే రెండుమూడుసార్లు పవనే ఆమెకు ఫోన్ చేసినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం శ్రీహరితో పవన్ కళ్యాణ్‌‌కు ఉన్న స్నేహ బంధమేనట. శ్రీహరిని సోదరుడిగా పవన్ కళ్యాణ్‌ భావించేవారట. ఆయన మరణించినప్పుడు పవన్ కళ్యాణ్‌ ఎంతో బాధపడ్డారట. దీంతో ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలనుకుని భావించినా డిస్కో శాంతి తీసుకోలేదట. 
 
అయితే ఏదో ఒక రూపంలో శ్రీహరి కుటుంబానికి సహాయం చేయాలన్నది పవన్ ఆలోచన. అందుకే శాంతికి ఫోన్ చేసి.. అమ్మా మీరు మన పార్టీలోకి రండి.. వేరే పార్టీ గురించి ఆలోచించడం మానేయండి.. మీరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. మీకు మన పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారట. అయితే కాస్త సమయం కావాలని డిస్కో శాంతి పవన్‌ను అడిగినట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గీత గోవిందంలో ఆ సీన్లు.. క్యూ కడుతున్న అమ్మాయిలు..?