Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

దేవీ
మంగళవారం, 10 జూన్ 2025 (13:21 IST)
Balayya -malineni gopichand
నటసింహం, పద్మభూషణ్ అవార్డు గ్రహీత నందమూరి బాలకృష్ణ 65వ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. జానపద, సాంఘిక, పౌరాణిక పాత్రలతో మెప్పించిన మేటి నటుడు. ప్రజాసేవతో హిందూపురం అభివ్రుద్ధిక ఎంతో క్రిషిచేశారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సౌఖ్యాలు ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నానని అన్నారు.
 
కాగా, బాలక్రిష్ణ తో 111వ సినిమా చేయబోతున్న దర్శకుడు మలినేని గోపీచంద్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా అంబికా క్రిష్ణ కూడా తెలియజేశారు. ఇంకా పలువురు ప్రముఖులు బాలయ్యబాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

At Tirumala Sridhar and fans
తిరుమలలో నందమూరి బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకల హంగామా
ఇదిలా వుండగా, ఫ్యాన్స్ నుంచి హంగామా మొదలైంది. తిరుమలలోని అఖిలాండం వద్ద ఘనంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ బి. శ్రీధర్ వర్మ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా 650 కొబ్బరికాయలు పగలగొట్టి, 6.5 కిలోల కర్పూరంతో గ్రాండ్ హారతి ఇచ్చారు. శ్రీధర్ వర్మ మాట్లాడుతూ, బాలయ్య సినిమాలతో పాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ప్రజలకు అద్భుత వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని తిరుమల వెంకన్నను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో రుపేష్ వర్మ, సుబ్బు ఇతర ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. బాలయ్య జన్మదినం సందర్భంగా భక్తి, ఉత్సాహం, జోష్‌తో నిండిన ఈ ఈవెంట్ తిరుమలలో హైలైట్‌గా నిలిచింది. బాలకృష్ణ అభిమానులకు ఈ వేడుకలు పండగలా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments