Webdunia - Bharat's app for daily news and videos

Install App

"భీమ్లా నాయక్" బొమ్మ బ్లాక్ బస్టర్ - ట్వటర్‌లో ట్వీట్ల హోరు

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (08:30 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దగ్గుబాటి రానాల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "భీమ్లా నాయక్". శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలంగాణా రాష్ట్రంలో బెన్ఫిట్‌ షోలను ప్రదర్శించారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. నాలుగు ఆటలు వేసేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. 
 
పైగా, గత రెండు నెలలుగా అమల్లోని ఆంక్షలను "భీమ్లా నాయక్" చిత్రం విడుదలకు ఒక్క రోజు ముందు తెరపైకి తెచ్చింది. ఇన్ని ఆంక్షల మధ్య ఈ చిత్రం విడుదలైంది. బెన్ఫిట్ షోలు చూసిన ప్రేక్షకులు 'భీమ్లా నాయక్' బొమ్మ బ్లాక్‌బస్టర్ అంటూ రివ్యూలు రాస్తున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ దాదాపుగా పాజిటివ్ టాక్‌ను వ్యక్తం చేస్తున్నారు. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ట్విట్టర్‌లో కామెంట్ చేస్తున్నారు. 
 
మలయాళంలో విడుదలై సూపర్ హిట్ సాధించిన "అయ్యప్పనుమ్ కోషియమ్‌"కు ఈ చిత్రం రీమేక్. అక్కడ బిజీ మీనన్, పృథ్విరాజ్ నటించగా, 'భీమ్లా నాయక్‌'లో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిలు నటించారు. సాగర్ కె చంద్ర తెరకెక్కించారు. యూఎస్ ఇప్పటికే ప్రిమియర్ షోలు వేశారు. తెలంగాణాలో శుక్రవారం అర్థరాత్రి నుంచి బెన్ఫిట్ షోలను ప్రదర్శించారు. 
 
దర్శకుడి సాగర్ చంద్ర టేకింగ్, త్రివిక్రమ్ స్క్రీన్‌ ప్లే అద్భుతంగా ఉన్నాయని కితాబిస్తున్నారు. ఫస్టాఫ్ కొంత నెమ్మదిగా సాగినప్పటికీ రెండో భాగం మాత్రం అదిరిపోయిందని, సినిమా మొత్తానికి ఓ ఊపు వస్తుందని, ఆ తర్వాత ప్రతి సన్నివేశం కళ్లు తిప్పుకోకుండా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా, పవన్ కళ్యాణ్, రానాల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా ఉన్నాయి. ముఖ్యంగా, ఇందులో రానా నటన ప్రత్యేక ఆకర్షణంగా ఉంది. నెగెటివ్ షేడ్స్‌లో రానా కుమ్మేశాడని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments