Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వేదికపై కనువిందు చేయనున్న పవన్, మహేష్.. ఎప్పుడు.. ఎక్కడ..?

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (15:17 IST)
తెలుగు హీరోల మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరి సినిమాకి మరొకరు వాయిస్ ఓవర్ ఇవ్వడం, కలిసి ఒకే ఫ్రేమ్‌లో నటించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఫిల్మ్‌నగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. అదేమిటా అని అనుకుంటున్నారా..? అదేనండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకే వేదికపై కనిపించనున్నారట. 
 
తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్(టీసీపీఈయూ) స్థాపించి 25ఏళ్లు అయిన సందర్భంగా సంస్థ రజతోత్సవ వేడుకలను హైదరాబాద్‌లో నిర్వహించనుంది. గచ్చిబౌలి ఇన్‌డోర్‌ స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దలు హాజరు కాబోతున్నారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్‌, నిర్మాతలు కె.ఎస్‌ రామరావు, దిల్‌రాజు, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్‌.శంకర్‌, మా అధ్యక్షుడు నరేశ్‌, జీవితా రాజశేఖర్‌, రాజీవ్‌ కనకాల తదితరులు ఇప్పటికే ఈ విషయాన్ని మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు.
 
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలను అతిథులుగా ఆహ్వానించగా ప్రోగ్రామ్‌కి వచ్చేందుకు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు అంగీకరించినట్లుగా తెలుస్తుంది.
 
ఈ ఇద్దరు హీరోలను ఒకే వేదికపై చూడాలనుకుంటున్న అభిమానుల కల ఈ కార్యక్రమం ద్వారా నెరవేరనున్నట్లుగా తెలుస్తుంది. సెప్టెంబర్ 8వ తేదీన ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించారు. గతంలో వీరిని కలపడానికి చాలా మంది ప్రయత్నాలు చేసినప్పటికీ అది సాధ్యం కాలేదు. 
 
వీళ్లిద్దరు చివరగా మహేష్ బాబు హీరోగా నటించిన యువరాజు సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒకే వేదికపైకి వచ్చారు. ఆ తర్వాత ఇంత కాలానికి ఒకే వేదికను పంచుకోనున్నారు. ఏదేమైనా ఈ ఇద్దరు హీరోలు మరోసారి తమ మధ్య ఉన్న స్నేహబంధాన్ని అభిమానులకు గుర్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Money Hunt challenge: ఓఆర్ఆర్‌లో మనీ హంట్ ఛాలెంజ్.. ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్ (video)

జనసేన నేత పుట్టిన రోజు.. ఏలూరులో రేవ్ పార్టీ.. అశ్లీల నృత్యాలు- సస్పెండ్ (video)

రేణిగుంట: క్యాషియర్ మెడపై కత్తి పెట్టిన యువకుడు.. సంచిలో డబ్బు వేయమని? (video)

డిసెంబర్ 21-25 వరకు భవానీ దీక్ష.. భక్తుల కోసం భవానీ దీక్ష 2024 యాప్

ప్రేమకు హద్దులు లేవు.. వరంగల్ అబ్బాయి.. టర్కీ అమ్మాయికి డుం.. డుం.. డుం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments