Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ వాచీ చాలా అందంగా వుంది... ఇవ్వమంటే ఇచ్చేస్తామా? 'శ్రీరెడ్డి'పై పవిత్రా లోకేష్ పంచ్‌లు(Video)

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా క్యాస్టింగ్ కౌచ్ గురించి నానా రభస జరుగుతున్న సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ కు బలైపోయామంటూ శ్రీరెడ్డి, మాధవీ లత తదితర తారలు మీడియా ముందుకు వచ్చి బాహాటంగా చెప

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (11:29 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా క్యాస్టింగ్ కౌచ్ గురించి నానా రభస జరుగుతున్న సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ కు బలైపోయామంటూ శ్రీరెడ్డి, మాధవీ లత తదితర తారలు మీడియా ముందుకు వచ్చి బాహాటంగా చెప్పేశారు. మరికొందరు కూడా వారితో కలిసి గొంతు కలిపారు. ఐతే క్యాస్టింగ్ కౌచ్ అనే పదమే తప్పు అని నటి పవిత్రా లోకేష్ అన్నారు. 
 
ప్రముఖ టీవీ ఛానల్‌తో ఆమె క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇలా చెప్పుకొచ్చారు. " క్యాస్టింగ్ కౌచ్ అనేది సెన్సిటివ్ పాయింట్. ప్రపంచంలో పురుషులు, స్త్రీలు వున్నారు. పురుషులు, స్త్రీల పట్ల అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, అలాగే మరికొందరు స్త్రీలు, పురుషుల పట్ల అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అవతలి వ్యక్తి తనకు ఏదో కావాలని అడిగినప్పుడు నేను నో చెబితే... అవతలి వ్యక్తికి ఛాన్స్ ఎక్కడుంటుంది?
 
నా ప్రాధన్యాలు ఏమిటో నాకు తెలుసు. డబ్బు సంపాదన అనేది అనేక మార్గాల ద్వారా ఆర్జించవచ్చు. డబ్బే లక్ష్యంగా జీవితం సాగకూడదు. మనం చేస్తున్న పనిలో ఇబ్బంది తలెత్తినప్పుడు మరో పనిని చూసుకుంటాం. అంతే కదా. అందుకే కదా ప్రపంచంలో ఎన్నో పనులున్నాయి. మట్టి పాత్రలు అమ్ముకుని ఎంతోమంది మహిళలు జీవించడం లేదా. వాళ్ల గౌరవానికి భంగం కలుగకుండా వారు తమ పనిని చేసుకుంటున్నారు. ఏదైనా అంతే. 
 
మీ అందమైన వాచీ నాకు నచ్చింది.. ఇవ్వమని అడిగితే ఇచ్చేస్తామా? ఆ అందమైన వాచీ ఇవ్వాలో వద్దో మనం డిసైడ్ చేసుకోవాలి. మనం ఏమీ చిన్నపిల్లలం కాదు. ఏదో ఆశించి లొంగిపోయి, దక్కకపోతే దక్కలేదని చెప్పడం ఎంతవరకు సమంజసం? క్యాస్టింగ్ కౌచ్ అనేది నా దృష్టిలో తప్పు పదం. ఎవరో ఒకరు అడ్వాంటేజ్ తీసుకున్నారని చిత్ర పరిశ్రమ మొత్తాన్ని దూషించడం తప్పు. 18 ఏళ్లు నిండిన తర్వాత మహిళలు ఏది తప్పో ఏదో ఒప్పో తెలుసుకునే తెలివి వుంటుంది. ఇండస్ట్రీకి వస్తున్న అమ్మాయిలు చాలా తెలివిగానే వుంటున్నారు. అనుకున్నంత తెలివితక్కువవారు ఎవరూ లేరు" అంటూ పవిత్రా లోకేష్ చెప్పారు. డైరెక్టుగా శ్రీరెడ్డి పేరు ప్రస్తావించకపోయినా ఈ మాటలు మాత్రం శ్రీరెడ్డి చేస్తున్న వాదనకు తగులుతాయని అనుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments