Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, రానా ఇద్ద‌రూ ఇగోయిస్టులే!‌

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (22:43 IST)
pawan, rana
ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, రానా ఇద్ద‌రు ఇగోల క‌థ‌తో తెలుగులో ఓ సినిమా వ‌స్తోంది. ఇది మ‌ల‌యాళం 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్సకు రీమేక్. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మాత‌. ఈ సినిమా మాతృక‌లోని అంశాల‌ను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి తీస్తున్నారు. ఈ సినిమాకు ఇద్ద‌రు ద‌ర్శ‌కులు వున్నారు. సాగ‌ర్‌చంద్ర డైరెక్ష‌న్ స్కిల్స్ మీద న‌మ్మ‌కంతోనే ఆయ‌న‌ను డైరెక్ట‌ర్‌గా తీసుకున్నాం.

అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు, రానా గారు న‌టిస్తుండ‌టంతో, ప్రాజెక్ట్ పెద్ద‌దైపోయింది. దాన్ని బ్యాలెన్స్ చేయ‌డం కోస‌మే త్రివిక్ర‌మ్ గారు స్క్రిప్ట్‌లోకి వ‌చ్చారు. ఆయ‌న స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ సినిమాకి బ‌ల‌మ‌వుతాయి అని నిర్మాత తెలియ‌జేస్తున్నారు.

ఇందులో హీరో విల‌న్ అని కాకుండా బేల‌న్స్ చేస్తూ తీసిన సినిమా. ఇప్ప‌టికీ 40శాతం షూటింగ్ పూర్త‌యింది. మ‌ల‌యాళంలో లేని ఎపిసోడ్ ఇందులో వుంటుంది. ప‌వ‌న్ ఇమేజ్‌కు త‌గిన‌ట్లుగా ఫ్లాష్‌బేక్ ఎపిసోడ్ కొత్త‌గా పెడుతున్నారు. రానా జోడీగా ఐశ్వ‌ర్యా రాజేష్ న‌టిస్తోంది. ప‌వ‌న్‌కు జోడీగా ఇంకా ఎవ‌రినీ అనుకోలేదు. టైటిల్ కూడా పెట్ట‌లేదు. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేస్తామ‌ని తెలియ‌జేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments