Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమానుల తోపులాట... ఎక్కడెక్కడో తాకడంతో రెస్టారెంట్‌లో నక్కిన పరిణితి చోప్రా

సినీ నటులంటే అభిమానులకు ఎక్కడలేని అభిమానం ముంచుకొస్తుంది. ఎక్కడైనా ఆ అభిమానం హద్దులు దాటుతుంది. సినీ నటులకు గుళ్లు కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటారు. తమ అభిమాన తార వస్తున్నారంటే రెక్కలు కట్టుకుని వాలిప

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (17:18 IST)
సినీ నటులంటే అభిమానులకు ఎక్కడలేని అభిమానం ముంచుకొస్తుంది. ఎక్కడైనా ఆ అభిమానం హద్దులు దాటుతుంది. సినీ నటులకు గుళ్లు కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటారు. తమ అభిమాన తార వస్తున్నారంటే రెక్కలు కట్టుకుని వాలిపోతారు. అలాంటి చోట అభిమానుల హడావుడికి అంతం ఉండదు. అలాంటి అభిమానులే తాజాగా పరిణితి చోప్రాకు చుక్కలు చూపించారట. అయితే ఈ అభిమానం కొన్ని సందర్భాల్లో హీరోల విషయంలో ఒకలా ఉంటే హీరోయిన్స్ విషయంలో మరోలా ఉంటుంది! అందుకే జనాల మధ్యలోకి వచ్చే సందర్భంలో హీరోయిన్స్ తెగ కంగారు పడిపోతుంటారు.
 
ఎందుకంటే ఈ హడావిడిలో హీరోయిన్స్‌ని పట్టుకునేవాళ్లూ వారి పర్సనల్ పార్ట్స్‌ని టచ్ చేసేవారూ లేకపోలేరు. అందుకే ఏదైన ప్రారంభోత్సవానికి వచ్చేటప్పుడు హీరోయిన్లు చుట్టూ వీలైనంత ఎక్కువమంది సెక్యూరిటీ గార్డులు ఉండేలా చూసుకుంటారు. అదే వ్యక్తిగతంగా ఏ షాపింగ్ మాల్‌కో, సినిమాకో, పబ్‌కో, రెస్టారెంట్‌కో వెళ్లాల్సి వస్తే.. అక్కడ ఫ్యాన్స్ చేతికి దొరికిపోతే.. ఇక అంతే సంగతులు. ఆ ఇబ్బందిని తాజాగా పరిణితి చోప్రా ఎదుర్కొంది. ఈ మధ్య గోవా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణితి చోప్రాను ఫ్యాన్స్ చుట్టుముట్టారట. 
 
సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడీ మరి ముందుకు వచ్చారట. అంతేకాదు... ఆమెతో కరచాలనం చేయాలని ఏకంగా ఆమెను పట్టుకోవాలని చాలామంది ప్రయత్నించారట. ఈ సందర్భంలో చిన్నసైజు తోపులాటే జరగడంతో ఆ ఉక్కిరిబిక్కిరి పరిస్థితిని తట్టుకోలేక పరిణితి అక్కడి నుండి ఉడాయించి... పక్కనున్న రెస్టారెంట్‌లో దాక్కోవాల్సి వచ్చిందట. కాసేపటికి ఆ హడావిడి కాస్త తగ్గుముఖం పట్టడంతో సీఐఎస్ ఎఫ్ సాయంతో అక్కడ నుంచి బయటపడిందట. 

మీ ఫోనులో వెబ్‌దునియా తెలుగు వార్తలు, సినిమా, ఇంకా మరిన్ని విశేషాలు... మరింత వేగంగా పొందేందుకు Mobile APP డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ ఇలా జావగారిపోయారేంటి? ఏమైంది? (video)

రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

పాక్ ఉద్యోగికి భారత్ డెడ్‌లైన్ - 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ హుకుం..

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments