Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొప్ప చారిత్రాత్మక చిత్రం ‘పానిపట్‌’ వ‌చ్చేది ఎప్పుడు?

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (20:58 IST)
భారతదేశ చరిత్రలో పానిపట్‌ యుద్దాలకు ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. మూడవ పానిపట్‌ యుద్ధం కథాంశంగా రూపొందుతున్న పీరియాడికల్‌ మూవీ ‘పానిపట్'‌. స్టార్‌ డైరెక్టర్‌ అశుతోష్‌ గోవర్‌కర్‌ దర్శకత్వంలో సునీత గోవర్‌కర్‌, రోహిత్‌ షీలాత్కర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరాఠా యోధుడు సదాశివరావ్‌ పాత్రలో అర్జున్‌ కపూర్‌, గోపికాబాయి పాత్రలో పద్మిని కొల్హాపురి, కృతిసనన్‌ పార్వతీబాయిగా, సంజయ్‌దత్‌ ఆహ్మద్‌ అబుద్‌అలీగా నటిస్తున్నారు.
 
పురన్‌దాస్‌ గుప్తా కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల చిత్ర యూనిట్‌ ‘పానిపట్‌’ సినిమా నుంచి క్యారెక్టర్‌ పోస్టర్స్‌తో పాటు థియేట్రికల్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేసింది. ‘అహ్మద్‌ షా అబ్దాలీ.. అతడి నీడ ఎక్కడ పడితే అక్కడ మరణం ప్రళయ తాండవం చేస్తుంది’ అంటూ సంజయ్‌ క్యారెక్టర్‌ని చూపించారు. 
 
ఆయన బాడీ లాంగ్వేజ్‌ అబ్దాలీ పాత్రకు హుందాతనం తీసుకొచ్చింది.. విజువల్స్‌, రీరికార్డింగ్‌, ఆర్ట్‌ వర్క్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తుంది. భారీ బడ్జెట్‌, హైటెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందిన ఈ సినిమాకు అమేజింగ్‌ రెస్పాన్స్‌ వస్తుంది. హిస్టారికల్‌ విజువల్‌ వండర్‌గా రూపొందిన ‘పానిపట్‌’ చిత్రం డిసెంబర్‌ 6న విడుదలవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments