Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానా దగ్గుబాటి సమర్పకుడిగా పాన్ ఇండియా మూవీ- 777 ఛార్లి

Webdunia
సోమవారం, 2 మే 2022 (11:53 IST)
Rana Daggubati
`అతడే శ్రీమన్నారాయణ `చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానాన్ని సంపాదించుకున్న క‌థానాయ‌కుడు ర‌క్షిత్ శెట్టి. మ‌రో విభిన్న‌మైన క‌థా చిత్రం  ‘777 ఛార్లి’తో ఆడియెన్స్‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ జూన్ 10న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ లెవ‌ల్లో విడుద‌ల‌వుతుంది.
 
ఛార్లి అనే కుక్క పిల్ల అనుకోని ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు వ‌చ్చి ఇబ్బంద‌లు ప‌డిన‌ప్పుడు ధ‌ర్మ అనే వ్య‌క్తిని ఎలా క‌లుసుకుంది. వారి మ‌ధ్య అనుబంధం ఎలా ఏర్ప‌డింది. చివ‌ర‌కు ఏం జ‌రిగింద‌నే విష‌యాల‌ను 777 ఛార్లి అనే అడ్వెంచర‌స్ కామెడీలో చూపించ‌బోతున్నారు. ర‌క్షిత్ శెట్టి ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టిస్తూ జి.ఎస్‌.గుప్తాతో క‌లిసి త‌న ప‌ర‌మ్ వ‌హ్ బ్యాన‌ర్‌పై సినిమాను నిర్మించారు. సంగీత శ్రింగేరి, రాజ్ బి.షెట్టి, డానిష్ సెయిట్‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. కిర‌ణ్ రాజ్‌.కె ద‌ర్శ‌కుడు.
ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి సమర్పకుడిగా ఛార్లి 777 చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అలాగే మలయాళంలో నటుడు, నిర్మాత  పృథ్వీ రాజ్ సుకుమారన్, తమిళంలో కార్తీక్ సుబ్బరాజ్ చిత్ర సమర్పకులుగా వ్యవహరించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్ఎక్స్ ప్లోరర్స్ కార్నివాల్‌లో శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రదర్శించిన గ్రామీణ విద్యార్థులు

మాయమాటలు చెప్పి భర్త కిడ్నీ అప్పగించింది... ఆ డబ్బుతో ప్రియుడితో భార్య పరారీ!!

సీఎం పీఠం నుంచి రేవంత్ రెడ్డిని దించేందుకు కుట్ర సాగుతోందా?

శవం పెట్టడానికి రవ్వంత జాగా కూడా లేదు.. రాత్రంతా అంబులెన్స్‌లోనే మృతదేహం... (Video)

ఒసే నా ప్రియురాలా.... నీ భర్త బాధ వదిలిపోయిందే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments