పాకిస్థాన్ నటీనటులకు మద్దతు తెలిపే బాలీవుడ్ నటీనటుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. యురీ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పాకిస్థాన్ నటీనటులు భారత్‌లో ప
పాకిస్థాన్ నటీనటులకు మద్దతు తెలిపే బాలీవుడ్ నటీనటుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. యురీ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పాకిస్థాన్ నటీనటులు భారత్‌లో పర్యటిస్తే భౌతిక దాడులకు దిగుతామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన హెచ్చరించింది.
ఈ వ్యాఖ్యలను బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తీవ్రంగా ఖండించాడు. పైగా, పాకిస్థాన్ నటీనటులు తీవ్రవాదులు కాదనీ, వారు భారత్‌లో స్వేచ్ఛగా పర్యటించవచ్చంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది.
ఈ నేపథ్యంలో రాధికా ఆప్టే తాజాగా పాక్ నటీనటులకు మద్దతు తెలిపింది. పాకిస్థానీ నటులపై నిషేధం విధించడం సరికాదని వాదించారు. స్విట్జర్లాండ్‌లో తయారైన ఓ వాచ్.. భారత్‌లో వారి సొంత షాపుల్లోనే అమ్ముతున్నప్పుడు పాక్ నటులు ఇక్కడ నటించడం తప్పులేదని రాధిక వ్యాఖ్యానించారు.