Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి+ కోట శ్రీనివాసరావు కలిపితే నేను : 'ఈడు గోల్డెహె' సునీల్‌ ఇంటర్యూ

''నేను మైమ్ ఏక్షన్‌ బాగా చేస్తాను. సినిమాల్లోకి రాకముందు.. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో కొన్ని ప్రదర్శనలు ఇచ్చాను. ఆ తర్వాత పూణె ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లోనూ ఇచ్చాను. తర్వాత ఢిల్లీలోనూ ఇచ్చాను. నటుడిగా గుర్తిం

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2016 (20:24 IST)
''నేను మైమ్ ఏక్షన్‌ బాగా చేస్తాను. సినిమాల్లోకి రాకముందు.. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో కొన్ని  ప్రదర్శనలు ఇచ్చాను.  ఆ తర్వాత పూణె ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లోనూ ఇచ్చాను. తర్వాత ఢిల్లీలోనూ ఇచ్చాను. నటుడిగా గుర్తింపు రావాలంటే అది బాగా చేయాలి... అప్పటి నుంచి నటుడిగా పర్వాలేదనే తృప్తి నాకుంది'' అని తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు హాస్యనటుడు కమ్‌ హీరో అయిన సునీల్‌ రాజు. ఇటీవలే ఆయన నటించిన 'జక్కన్న' సినిమా విడుదలై.. డివైడ్‌ టాక్‌ వచ్చింది. కానీ.. సినిమా రివ్యూలు బాగా రాయకపోయినా... కమర్షియల్‌గా నిర్మాత, బయ్యర్లు చాలా హ్యాపీ అని సునీల్‌ తెలియజేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన 'ఈడు గోల్డ్‌ ఎహె' అనే సినిమా చేశాడు. ఇది ఈ నెల 7న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా సునీల్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ..
 
టైటిల్‌ పలకాలంటే.. వెటకారంగా వుందికదా?
అవునండి... నేను క్యాజువల్‌గా మాట్లాడే బాషలో నేను నటించిన సినిమాల్లో ఎక్కువగా 'ఎహె..' అంటూ పలుకుతాను. మా భీమవరంలో ఇలాగే కొన్ని పదాలు మాట్లాడాలి.. స్పష్టంగా మాట్లాడితే.. అక్కడ నచ్చదు.. కొన్నికొన్ని పదాలు యాసలు.. కొందరికి నచ్చవు. ఈ సినిమా టైటిల్‌ కూడా.. దర్శకుడు వీరు పోట్ల నా ఫొటో పంపించమంటే కొత్తగా దిగింది పంపాను. వెంటనే క్యాప్షన్‌ కూడా ఇలా చేసి పంపాడు. ఇది చాలా సరదాగా ఉండే టైటిల్‌.                   
 
శీదేవి గారిని, వారిద్దరినీ కలిపితేనే నేను. అది ఎవరికీ తెలీదు. అందరినీ ఎంటర్టైన్‌ చెయ్యాలి అనుకునేవాడిని. అందుకే నాకు, నిర్మాతకు అందరికీ నచ్చేలా ఉండే స్క్రిప్ట్‌‌ను చూజ్‌ చేసుకుంటాను.
 
'జక్కన్న' సినిమా గురించి గొప్పగా చెప్పారు. అనుకున్న ఫలితాన్ని ఇచ్చిందా?
ఇంతకు ముందు చేసిన 'పూల రంగడు, భీమవరం బుల్లోడు, జక్కన్న' సినిమాలు  కమర్షియల్‌, కామెడీ ఎంటర్టైనర్స్‌. వాటిలో ముందు ఏం జరగబోతోందో చెప్పెయ్యొచ్చు. కానీ 'మర్యాద రామన్న' సినిమా డిఫరెంట్‌. ఇది కూడా అలాంటిదే. నేను ఇంట్లో కూర్చుని డీవీడీ పెట్టుకుని చూసే సినిమాలలో ఇదీ ఒకటి. ప్రతో ఒక్కరూ శాటిసిఫై అవుతారు. జక్కన్న విషయంలో నేను, నిర్మాతలు హ్యాపీ.. బయట రివ్యూలు రాసినట్లుగా లేదు. కమర్షియల్‌గా నా దృష్టిలో హిట్టే.
 
పబ్లిసిటీలో మాస్క్‌ పెట్టారు.. రెండు పాత్రలా?
అది రిలీవ్‌ చేయకూడదు. చేస్తే కథ తెలిసిపోతుంది. కొన్ని సందర్భాలు మొహం బయట పడకుండా వుండేందుకు అలా పబ్లిసిటీ ఇచ్చాం. 
 
ఈ దర్శకుడితో చేయాలని ఎలా అనిపించింది?
నేను, త్రివిక్రమ్‌ హైదరాబాద్‌లో రూమ్‌లో వుండగా.. వీరుపోట్ల... రూమ్‌ కోసం వెతుకుతున్నాడు. అప్పట్లో నేనే రూమ్‌ చూపించాను. ఆ తర్వాత కొంతమంది పరిచయం అయ్యారు. చాలామంది నాతోటి వారంతా.. పెద్ద పొజిషన్‌లోకి వెళ్ళిపోయారు. వీరుపోట్ల కూడా చేరాడు. ఎప్పటి నుంచో సినిమా చేయాలనుంది.. ఇప్పటికి వర్కవుట్‌ అయింది.
 
మీ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతోంది?
నా పాత్ర పేరు బంగార్రాజు. ఈ కథ నాకు చాలా బాగా కుదిరింది. నన్ను దష్టిలో పెట్టుకునే వీరు పోట్ల ఈ కథ రాశాడు. 'మర్యాదరామన్న'లా ఈ సినిమా వల్ల నాకు అన్ని రకాలుగా నాకు పేరొస్తుంది. ఫస్ట్‌ టైమ్‌ ఫ్యామిలీ ఎమోషన్స్‌‌తో పాటు క్రైమ్‌ థ్రిల్లర్‌‌గా ఉండే సినిమా చేశాను. ఇందులో కామెడీ పరంగా పాత సునీల్‌‌ని చూస్తారు. ప్రతి సీన్లో ఆ కామెడీ మిస్‌ కాకుండా చూశాడు వీరు పోట్ల.
 
కమర్షియల్‌ సినిమా చేయాలడం ఎలా ఉంది?
కమర్షియల్‌ సినిమాలు చేయడం చాలా కష్టం. అది అందరికీ రాదు. కమర్షియల్‌ సినిమా అంటే ఐటమ్స్‌లా ఉంటుంది. రొటీన్‌ అనే ఫీలింగ్‌ వచ్చేటప్పటికి వేరే ఐటమ్‌‌ని కొత్తగా సర్వ్‌ చెయ్యాలి. ఒక ఆర్టిస్ట్‌ దమ్ము ఏమిటనేది కమర్షియల్‌, రొటీన్‌ సినిమాల్లోనే బయటపడుతుందని నేను నమ్ముతాను. ఇక కొత్త, డిఫరెంట్‌ సినిమాలు ఆర్టిస్ట్ దమ్ముని పెంచుతాయి.
 
కమేడియన్‌ నుంచి హీరోగా జర్నీ ఎనలైజ్‌ చేసుకుంటో ఎలా అనిపిస్తుంది?
నేను అసలు ఇండస్ట్రీకి వచ్చింది విలన్‌ అవుదామని. మోహన్‌ బాబులా విలనిజం, కామెడీ చేసి ఫైనల్‌గా కోట శ్రీనివాసరావు గారిలా సెటిలవుదామని అనుకున్నా. నేను ఎక్కువగా కాపీ కొట్టేది కోటగారిని, శ్రీదేవిగారిని. వారిద్దరినీ కలిపితేనే నేను. నా ఫేస్‌ కూడా శ్రీదేవి అంత అమాయకంగా వుంటుంది. అది ఎవరికీ తెలీదు. అందరినీ ఎంటర్టైన్‌ చెయ్యాలి అనుకునేవాడిని.
 
మరి విలన్‌గా చేసే ఆలోచన వుందా?
తప్పకుండా.. అయితే.. వేరే భాషలో చేస్తాను.
 
ఆఫర్లు వచ్చాయా?
చాలాసార్లు అడిగారు. నేను కాస్త టైమ్‌ అడిగాను. ఇక్కడో విషయం చెప్పాలి. రామ్‌గోపాల్‌ వర్మ..గారి దగ్గరికెళ్ళి వేషం అడిగాను. నువ్వు చూడ్డానికి విలన్‌లా వున్నావు. నువ్వేం కామెడీ చేస్తావ్‌ అన్నారు. ఆయన నన్ను ఆ కోణంలో చూశారు. నేను కూడా అదే అవ్వాలనుకున్నా.. కానీ డెస్టినీ ఇంకోలా మారిపోయింది.
 
ఇంట్లో వాళ్లకి టైం ఎలా కేటాయిస్తారు ?
కమేడియన్‌గా వున్నప్పుడు అస్సలు టైమ్‌ ఇచ్చేవాడిని కాదు. నిద్రపోవడానికి టైం దొరికేదికాదు. సినిమా సినిమాకూ మధ్య జరిగే ప్రయాణంలో నిద్రపోయేవాడిని. రోజుకు 5 సినిమాలు చేసేవాడిని.. లంచ్‌ బ్రేక్‌లో మరో సినిమాకు చేసిన రోజులున్నాయి. అలాంటిది.  హీరో అయ్యాక.. ఇప్పుడు కాస్త కేటాయిస్తున్నాను. అయినా ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ ఫీలవలేదు.
 
పిల్లలు మీ సినిమాలు చూసి ఏమంటున్నారు?
మా అబ్బాయి చరణ్‌. వాడికి రెండేళ్ళు.. వాడు సరిగ్గా నిలబడడు.. అంటే అంత అల్లరి చేస్తాడు. డాన్స్‌లు చేస్తాడు.. పెద్దయ్యాక ఏమవుతాడో తెలీదుకానీ.. నా సినిమాలు చూసి నవ్వుతాడు. 
 
ఆమధ్య సమాజ సేవ అన్నారు ఎంతవరకు వచ్చింది?
ఎవరేమన్నా చేసేప్పుడు పిలిస్తే వెళ్లి ముందుండి చేస్తుంటా. ఇక నా బర్త్‌ డే, అమ్మ బర్త్‌ డే అప్పుడు నేనే స్వయంగా వెళ్లి కాంట్రిబ్యూట్‌ చేస్తా. మంచి ఆర్గనైజేషన్‌ ఓపెన్‌ చేసి సేవ చేయాలని ఉంది. ప్రస్తుతం గ్రౌండ్‌ వర్క్‌ చేస్తున్నాను. వచ్చే ఏడాది మొదలుపెడతా. అంటే నా సొంత డబ్బుతో మానసికంగా సరిగా లేని ఓ పదిమందిని దత్తత తీసుకుని వాళ్ళ చదువుకుని, ఉద్యోగాలు చేసుకునే స్థాయికి వచ్చే వరకూ చూసుకోవాలని ఉంది.
 
వాళ్ళకే సేవ చేయాలని ఎందుకనిపించింది?
వారిలో కల్మషంలేని ప్రవర్తన, నిజాయితీ వుంటుంది. నేను యాక్టింగ్‌ కోర్సు నేర్చుకునేటప్పుడు.. దేవదాస్‌ కనకాలగారు.. వికలాంగుడివైతే ఎలా చేస్తావో చేసి చూపించమనేవారు. అప్పట్లో వారిని బాగా పరిశీలించి.. కొన్ని చేశాను. ఎందుకంటే.. వారిలోనే అసలైన నటన వుంది. వారు వారికి తగినట్లు ప్రవర్తిస్తారు. అందులో కృతకంగా వుండదు. అసలు నటుడిగా నేను అక్కడే చాలా నేర్చుకున్నాను. అది అలా ముద్రపడిందో ఏమోకానీ..వారి గురించి ఏదో ఒకటి చేయాలనే తపన వుంది. అందుకు నాలాగా ఆలోచించే ఐదుగురితో సంస్థ స్థాపించి.. ఒకరికి కుదరకపోయినా.. మరొకరు సాయం చేసేలా ప్లాన్‌ చేస్తున్నాం. అదికూడా నా స్వంత సంపాదనతోనే.
 
చిరంజీవి చిత్రంలో నటించారా?
చిరంజీవిగారే నాకు స్పూర్తి. ఆయన 150వ సినిమాలో యాక్ట్‌ చేయమని అడిగారు. అయితే అప్పటికే ఈడు గోల్డ్‌ ఎహే సినిమాకు డేట్స్‌ ఇచ్చేసి ఉండటం వల్ల కుదరలేదు. అయితే చిరంజీవిగారి సినిమాలో నేను యాక్ట్‌ చేస్తున్నాను. అయితే నాకు ఇంతకుముందు వచ్చిన ఆఫర్‌ వచ్చిన రోల్‌లో కాకుండా వేరే రోల్‌ చేస్తున్నాను. ఆయన సినిమాలో ప్రతి ఒక్క హీరో ఒక్క సీన్‌లోనైనా కన్పించాలని కోరుకుంటున్నారు. చాలామంది చేస్తామని అడిగారు కూడా. అసలు ఈ ఆలోచన నేనే రేపాను. ఇలా అందరినీ మోటివేట్‌ చేశాను. కానీ అది సాధ్యపడదుకదా.
 
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం క్రాంతి మాధవ్‌ గారి సినిమా చేస్తున్నాను. రాజేంద్రప్రసాద్‌గారి కామెడి స్టయిల్‌లో సాగుతూ ఓ మెసేజ్‌ ఇచ్చే చిత్రమది. ఇప్పటి వరకు 30 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది అని చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments