Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్, త్రివిక్రమ్‌ల కాంబోలో మూడో సినిమా ఎప్పుడు.. కాటమరాయుడుకి తర్వాతేనా?

అత్తారింటికి దారేది సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఎంత హిట్టైందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత త్రివిక్రమ్ ఖాతాలోనూ, పవన్ కల్యాణ్ ఖాతాలోనూ ఓ హిట్ కూడా పడలేదు. ప్రస్తుతం మంచి హిట్ కొట్టాలని పవ

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2016 (19:29 IST)
అత్తారింటికి దారేది సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఎంత హిట్టైందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత త్రివిక్రమ్ ఖాతాలోనూ, పవన్ కల్యాణ్ ఖాతాలోనూ ఓ హిట్ కూడా పడలేదు. ప్రస్తుతం మంచి హిట్ కొట్టాలని పవన్, త్రివిక్రమ్‌లు మల్లగుల్లాలు పడుతున్నారు. నితిన్‌తో అఆ చేసినా త్రివిక్రమ్‌కు కలిసిరాలేదు. ఇక పవనైతే సర్దార్ గబ్బర్ సింగ్ చేసి అట్టర్ ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబోలో కొత్త సినిమా రూపుదిద్దుకోనుందని చాలారోజులుగా ఫిలిమ్ నగర్ వర్గాల్లో ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. 
 
సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలో కొందరి కాంబినేషన్‌తో తెరకెక్కించే చిత్రాలు అద్భుత విజయాన్ని సాధిస్తుంటాయి. అలాంటి రేర్ కాంబినేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. జల్సాతో వీరిద్దరి ఫిలిమ్ జర్నీ మొదలైంది. ఇక రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా ఇద్దరూ మంచి ఆప్త మిత్రులు కావడం విశేషం. ఇప్పటికే పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది లాంటి చిత్రాలు బ్లాక్ బ్లస్టర్ అయ్యాయి. ఇప్పుడు మూడవ చిత్రం ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. 
 
ఈ సంవత్సరం పవన్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రం అట్టర్ ఫ్లాప్ కావడంతో అభిమానుల్లో నిరుత్సాహం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ సినిమా పవన్‌తో ఎప్పుడుంటుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైతే పవన్ కాటమరాయుడు సినిమాలో బిజీగా ఉన్నాడు. మధ్య మధ్యలో త్రివిక్రమ్‌ను కూడా పవన్ కలుస్తున్నాడని, స్క్రిప్ట్ ఓకే అయితే చకచకా సినిమాలు చేయాలని గబ్బర్ సింగ్ ఉవ్విళ్లూరుతున్నాడట. అదే కనుక జరిగితే పవన్ ఫ్యాన్సుకు పండగే పండగ అంటున్నారు సినీ జనం. కాటమరాయుడు, తివిక్రమ్ సినిమాలు రెండూ 2017లో రిలీజ్ అవుతాయని సినీ జనం అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments