Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాగల్ వర్సెస్ కాదల్ చిత్రం విడుదలకు సిద్ధం

డీవీ
మంగళవారం, 6 ఆగస్టు 2024 (17:05 IST)
Vijay Shankar, Vishika
విజయ్ శంకర్, విషిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "పాగల్ వర్సెస్ కాదల్". ఈ చిత్రాన్ని శివత్రి ఫిలింస్ బ్యానర్ పై పడ్డాన మన్మథరావు నిర్మిస్తున్నారు. రాజేశ్ ముదునూరి దర్శకత్వం వహిస్తున్నారు. బ్రహ్మాజి, షకలక శంకర్, ప్రశాంత్ కూఛిబొట్ల, అనూహ్య సారిపల్లి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "పాగల్ వర్సెస్ కాదల్" సినిమా ఈ నెల 9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో నిర్వహించారు.
 
హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ - మీడియా మిత్రులకు నమస్కారం. మా పాగల్ వర్సెస్ కాదల్ సినిమా ప్రెస్ మీట్ కు వచ్చినందుకు థ్యాంక్స్. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా మీ ముందుకు వస్తోంది. ఈ సినిమాలో నేను కార్తీక్ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. కార్తీక్ ఇన్నోసెంట్ అబ్బాయి. తన ప్రేయసి ప్రియతో ఇబ్బందులు పడుతుంటాడు. పాగల్ వర్సెస్ కాదల్ సినిమా ప్రేమలో ఉన్న ప్రతి లవర్ రిలేట్ చేసుకునేలా ఉంటుంది. ప్రియ పాత్రలో విషిక అద్భుతంగా నటించింది. ఈ నెల 9న థియేటర్స్ లోకి వస్తున్న మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
 
హీరోయిన్ విషిక మాట్లాడుతూ - అందరికీ నమస్కారం. పాగల్ వర్సెస్ కాదల్ సినిమాలో నేను ప్రియ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్ ను తను తన అనుమానంతో ఇబ్బందులు పెడుతుంటుంది. నా క్యారెక్టర్ చూసి మేము మా బాయ్ ప్రెండ్స్ ను ఇంత ఇబ్బంది పెట్టం అని అమ్మాయిలు అనుకుంటారు. నేను నటించిన కమిటీ కుర్రాళ్లు సినిమాతో పాటు పాగల్ వర్సెస్ కాదల్ కుడా ఒకే డేట్ కు ఈ నెల 9న రిలీజ్ అవుతున్నాయి. నా కెరీర్ లో మర్చిపోలేని సందర్భం ఇది. మా పాగల్ వర్సెస్ కాదల్ సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నా. అని చెప్పారు.
 
నటీనటులు - విజయ్ శంకర్, విషిక, బ్రహ్మాజి, షకలక శంకర్, ప్రశాంత్ కూఛిబొట్ల, అనూహ్య సారిపల్లి, ఆద్విక్ బండారు, తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments