Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ అవార్డులు.. ఉత్తమ చిత్రంగా గ్రీన్ బుక్... 2.Oకు అవార్డు దక్కిందా?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (11:05 IST)
హాలీవుడ్ సినిమా పండుగగా అభివర్ణించే ఆస్కార్ అవార్డులను సోమవారం వెల్లడించారు. ఈ అవార్డుల కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ సెలెబ్రిటీలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు అందుకుంటే చాలని భావించే సినిమావాళ్లు ఉంటారు. అటువంటి ప్రతిష్టాత్మక 91వ అకాడమీ అవార్డుల (ఆస్కార్ అవార్డులు) ప్రధానోత్సవం లాస్ ఏంజిల్స్‌లో సోమవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) ప్రారంభమైంది. ఆస్కార్ 2019 కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అయితే, ఇప్పటివరకు ప్రకటించిన జాబితాలో భారతీయ చలన చిత్రం 2.Oకు ఒక్క అవార్డు కూడా వరించలేదు. ఈ చిత్రం ఓ విభాగం కింద నామినేట్ అయిన విషయం తెల్సిందే.
 
ఇప్పటివరకు ప్రకటించిన వివరాల మేరకు ఉత్తమ చిత్రంగా గ్రీన్‌ బుక్ కైవసం చేసుకుంది. అలాగే, ఉత్తమ సహాయ నటుడు: మహేర్షలా అలీ(గ్రీన్ బుక్), ఉత్తమ సహాయ నటి: రెజీనా కింగ్(ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్), బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: రూత్ కార్టర్(బ్లాక్ పాంథర్), బెస్ట్ డాక్యుమెంటరీ: ఫ్రీ సోలో, ఉత్తమ విదేశీ భాషా చిత్రం: రోమా, బెస్ట్ సినిమాటోగ్రఫీ: ఆల్ఫాన్సో కోరోన్(రోమా), బెస్ట్ ఆనిమేటెడ్ ఫీచర్ ఫిలిం: స్పైడర్ మ్యాన్: ఇన్ టు ది స్పైడర్ వెర్స్, బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: బెహిమైన్ రాప్సోడీ, బెస్ట్ ఆనిమేటెడ్ షార్ట్ ఫిలిం: బవో, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్, బెస్ట్ మేకప్, హెయిర్ : వైస్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ : బొహెమియన్ రాప్సోడీ(జాన్ ఆట్మన్), బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : ఫస్ట్ మెన్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: గ్రీన్ బుక్(బ్రియన్ హెయెస్, పీటర్ ఫరెల్లీ, నిక్ వల్లెలోంగ), 
బెస్ట్ అడాప్టడ్ స్క్రీన్ ప్లే: బ్లాక్ కే క్లాన్స్ మెన్( స్పైక్ లీ, డేవిడ్ రాబినోవిట్జ్, చార్లీ వాచ్ టెల్), బెస్ట్ ఒరిజినల్ స్కోర్ : బ్లాక్ పాంతర్ (లుడ్ విగ్ గొరన్ సన్), బెస్ట్ ఒరిజినల్ సాంగ్ : షాలో(ఏ స్టార్ బార్న్), బెస్ట్ యాక్టర్ : రమి మాలెక్(బొహెమియన్ రాప్సోడీ), ఉత్తమ నటి: ఓల్వియా కోల్‌మెన్‌(ది ఫేవరెట్‌), ఉత్తమ దర్శకుడు: అల్ఫోన్సో క్యురాన్‌ (రోమా), ఉత్తమ చిత్రం: గ్రీన్‌బుక్‌‌లు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

వైసీపీకి వర్మకు ఉన్న సంబంధం అదే.. జీవీ రెడ్డి ఏమన్నారు..?

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments