Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్‌.టి.ఆర్‌.శత జయంతికి ఏడాదిపాటు ప్ర‌ణాళికః వైవిఎస్‌. చౌద‌రి

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (19:50 IST)
YVS chowdary prakatana
ఎన్‌.టి.ఆర్‌. జ‌యంతినాడు అన‌గా ఈరోజు ద‌ర్శ‌కుడు వై.వి.ఎస్ చౌద‌రి త‌న సినిమాలో తెలుగు అమ్మాయిని ప‌రిచ‌యం చేస్తున్న‌ట్లు రెండు రోజుల క్రిత‌మే ప్ర‌క‌టించారు. ఇప్పుడు మ‌రో ఏడాది ప్ర‌ణాళిక‌ను కూడా వెల్ల‌డిస్తున్నారు.
 
ఆ ‘యుగపురుషుని’ పేరు కలిసొచ్చేట్లుగా, నూతన కళాకారుల పరిచయ వేదికగా ‘New Talent Roars @‘ (‘NTR@‘) అనే బ్యానర్‌ ద్వారా  నా మిత్రులు నా దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఆ బ్యానర్‌ పేరు (‘NTR@‘) తోనే, నా ఆధ్వర్యంలో ఎటువంటి లాభాపేక్షలను ఆశించకుండా.. ‘ఆయన’ కుటుంబ సభ్యులు, బంధువుల సహకారంతో.. కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా ‘ఆయన’ సమకాలీకులు, సన్నిహితులు, సహచరులు, అధికారులు, ‘ఆయన’తో పనిజేసిన సిబ్బంది, ఇంకా ‘ఆయన’తో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్న వారందరితో, మరీ ముఖ్యంగా ‘ఆయన’ అభిమానులతో వారి వారికున్న అనుభవాల్ని, అనుబంధాల్ని.ఉత్సుకతతో నిండిన, ఆకర్షణీయమైన ఇంటర్వ్యూలుగా మ‌లుస్తున్నాను.
 
రాబోయే ఆయ‌న ‘శత జయంతి’ (28 మే, 2022) రోజు నుండీ సంవత్సరం పాటు (27 మే 2023 వరకూ).. ఆ ఇంటర్వ్యూలను రకరకాల ‘డిజిటల్‌’ వేదికల ద్వారా.. ‘ఆయన’ జ్ఞాపకాల రూపంలో ప్రపంచ వ్యాప్త ‘తెలుగు’ ప్రజానీకానికి చేరువ చేయాలనే బృహత్తర ప్రణాళికకు.. రూపకల్పన చేయడం జరిగింది అని..ఎన్‌. టి. ఆర్‌.99వ‌ జయంతి సందర్భంగా, మీకందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను,గర్విస్తున్నాను.ఇలాంటి కార్యాచరణలతో మరెంతో మంది అన్న’గారి అభిమానులు ముందుకు రావాలని ఆశిస్తున్నాను,వస్తారని విశ్వసిస్తున్నాను.అని వై వి ఎస్ చౌదరి ప్ర‌క‌టించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments