Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక‌వైపు నిర్మాత‌గా - మ‌రోవైపు ఓటీటీ రంగంలోకి ప్ర‌వేశిస్తున్న ష‌కీల‌

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (18:17 IST)
Shakeela cinema
ప్రముఖ నటి షకీల రెండు సినిమాలు నిర్మిస్తోంది. రమేష్ కావలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాల‌కు `అట్టర్ ప్లాప్, రొమాంటిక్` పేర్లు ఖ‌రారు చేశారు. వీటిల్లో ష‌కీలా కుమార్తె మిలా హీరోయిన్ గా నటిస్తుంది. రామానాయుడు స్టూడియోలో రెండు సినిమాల‌కు సంబంధించిన పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేసింది. 
 
అనంతంర షకీల మాట్లాడుతూ, తమ్ముడు రమేష్ చెప్పిన ఈ రెండు సినిమాలు నాకెంతో నచ్చాయి..అందరూ కొత్త వారితో ఈ సినిమాలు చేస్తున్నాము. ఈ రెండు సినిమాల్లో కూడా నా కూతురు మిలా హీరోయిన్గా న‌టిస్తోంది. గోవాలో అద్భుతమైన లోకేషన్స్ లలో షూటింగ్ చేస్తున్నాం. మేము తీసిన "లేడీస్ నాట్ అలౌడ్" సినిమాకు సెన్సార్ విషయంలో మేము  చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఎంతో మందిని రిక్వెస్ట్ చేసుకున్నాము. అందుకే ఇక మేము ఎవరినీ రిక్వెస్ట్ చేసుకోకూడదని మేము ఓటిటి ని స్టార్ట్ చెయ్యాలని ప్లాన్ చేశాం. మేము ఎదుర్కొన్న ఇబ్బందులు కొత్తవారు ఎదుర్కోరాదని కొత్తగా ఇండస్ట్రీ కు వచ్చే వారికి వెల్ కమ్ పలుకుతూ అందరికీ మా ఓటిటి ప్లాట్ ఫాం ఒక వేదిక కావాలని అనుకుంటున్నానని అన్నారు.
 
దర్శకుడు రమేష్ కావలి మాట్లాడుతూ, ఇది బిగినింగ్ మాత్రమే ముందు ముందు ఈ బ్యానర్ లో అనేక సినిమాలు చేస్తాము.అలాగే అక్క షకీల గారితో కలసి మేము ప్రారంభిస్తున్న "కె.ఆర్ డిజిటల్ ప్లెక్స్" ఓటిటి  ద్వారా అనేక సినిమాలు చేస్తూ  ఇందులో వారు తీసిన షార్ట్ ఫిల్మ్, సినిమా ఏదైనా కూడా ఫ్రీగా సపోర్ట్ చేస్తాము అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments