Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఘ‌వేంద్ర‌రావు పుట్టిన‌రోజున‌`పెళ్లి సంద‌D` రెండ‌వ‌పాట‌

Webdunia
బుధవారం, 19 మే 2021 (17:21 IST)
Raghavendrato
శతాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు, క్లాస్‌ని, మాస్‌ని, ఫ్యామిలీస్‌ని, భ‌క్త‌జ‌న‌కోటిని అల‌రించిన ఎన్నో అపూర్వ చిత్రాల‌ని అందించిన ద‌ర్శ‌కేంద్రుడి పుట్టిన‌రోజు మే23. ఈ విశిష్ట‌మైన రోజున ద‌ర్శ‌కేంద్రుడి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతోన్న‌`పెళ్లి సంద‌D` చిత్రంలోని రెండ‌వ‌పాట విడుద‌ల‌కానుంది. ఏప్రిల్ 28న విడుద‌లైన `పెళ్లిసంద‌D` చిత్రంలోని ఫ‌స్ట్ సాంగ్ `ప్రేమంటే ఏంటి..` శ్రోత‌ల‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ యూట్యూబ్‌లో దాదాపుగా 4 మిలియ‌న్ల ఆర్గానిక్ ప్యూస్‌ సాధించి రాఘ‌వేంద్ర‌రావు, కీర‌వాణిల కాంభినేష‌న్‌లో మ‌రో సూప‌ర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రంలోని రెండ‌వ‌పాట ద‌ర్శ‌కేంద్రుడి పుట్టిన‌రోజునాడు విడుద‌ల‌వ‌డం విశేషం.
 
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కురాలు గౌరి రోణంకి మాట్లాడుతూ,  రాఘ‌వేంద్ర‌రావు,  కీర‌వాణి కాంభినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలోని ప్ర‌తి పాట త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. డైరెక్ట‌ర్‌గా నాకు ఇదొక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. సినిమా చాలా బాగా వ‌స్తోంది``అన్నారు.
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ సాయిబాబా కోవెల‌మూడి మాట్లాడుతూ, ఏడు రోజులు ప్యాచ్‌వ‌ర్క్ మిన‌హా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్త‌య్యింది. లాక్‌డౌన్ తీసేశాక బ్యాలెన్స్ షూటింగ్ పూర్తిచేసి జూన్‌, జులైలో మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్నాం``అన్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రంలోని పాట‌లు విడుద‌ల‌వుతున్నాయి.
 
రోష‌న్, శ్రీ‌లీల, ప్ర‌కాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, స‌త్యంరాజేష్‌, రాజీవ్ క‌నకాల‌, శ్రీ‌నివాస్ రెడ్డి, శక‌లక శంక‌ర్‌, అన్న‌పూర్ణ‌, జాన్సి, ప్ర‌గ‌తి, హేమ‌, కౌముది, భ‌ద్రం, కిరీటి త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి
సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి
సాహిత్యం: శివ‌శ‌క్తి ద‌త్త‌, చంద్ర‌బోస్
సినిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్ నామ
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు
ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె,
‌మాట‌లు: శ్రీ‌ధ‌ర్ సీపాన‌
ఫైట్స్‌: వెంక‌ట్
కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్ వీజే
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: వి. మోహ‌న్ రావు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సాయిబాబా  కోవెల‌మూడి
స‌మ‌ర్ప‌ణ‌: కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌
నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని
ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: కె. రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ
ద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోణంకి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments