Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mardaani 3: నవరాత్రి ఆరంభం సందర్భంగా రాణి ముఖర్జీ మర్దానీ 3 పోస్టర్ విడుదల

డీవీ
సోమవారం, 22 సెప్టెంబరు 2025 (18:54 IST)
Rani Mukarjee
నవరాత్రి శుభారంభం సందర్భంగా యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న మర్దానీ 3 పోస్టర్‌ను ఆవిష్కరించారు. మంచి, చెడుకి జరిగే పోరాటాల్ని మర్దానీ 3లో చూపించబోతోన్నారు. రాణి ముఖర్జీ తనకు ఎంతో ఇష్టమైన, ప్రేమించిన డేర్ డెవిల్ పోలీస్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో మరోసారి కనిపించబోతోన్నారు. 
 
మహిషాసురుడిని చంపినప్పుడు దుర్గా మాత శక్తిని తెలిపే అయిగిరి నందిని శ్లోకంతో రిలీజ్ చేసిన పోస్టర్ అదిరిపోయింది. ఓ కేసుని పరిష్కరించడానికి, దాని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే శివానీ సంకల్పం ఎలాంటిదో ఈ పోస్టర్ చెప్పకనే చెబుతోంది.
 
ఇండియాలో ఉమెన్ సెంట్రిక్‌గా వచ్చిన చిత్రాలు, సిరీస్‌లలో మర్దానీకి ఉండే ప్రత్యేక స్థానం గురించి అందరికీ తెలిసిందే. సమాజానికి కనువిప్పు కలిగించేలా, కళ్ళు తెరిపించేలా అద్భుతమైన కథలతో మర్దానీ ప్రతీ సారి ఆకట్టుకుంటూనే ఉంటుంది. మన దేశంలో ప్రతిరోజూ జరిగే దారుణమైన నేరాలను అందరూ గుర్తించేలా మర్దానీ ఫ్రాంచైజీలు వస్తుంటాయి.
 
మర్దానీ (2014), మర్దానీ 2 (2019) వంటి భారీ విజయాల తర్వాత ఈ మూడో అధ్యాయం ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌ను ఇచ్చేలా తెరకెక్కిస్తున్నారు. అభిరాజ్ మినావాలా దర్శకత్వంలో ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. YRF నుంచి ఐకానిక్ ఉమెన్-కాప్ ఫ్రాంచైజీలో భాగంగా రానున్న ఈ మూడో పార్ట్‌ని ఫిబ్రవరి 27, 2026న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh : మెగా డీఎస్సీ వేడుక.. పవన్‌కు నారా లోకేష్ ఆహ్వానం

మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు వైకాపా నేతలు 106 కేసులు వేశారు : మంత్రి నారా లోకేశ్

కెనడాలో ఖలీస్థానీ ఉగ్రవాది ఇంద్రజీతి సింగ్ అరెస్టు

సహోద్యోగుల వేధింపులు.. మహిళా టీచర్‌పై వేధింపులు.. భర్త అస్సాంలో.. భార్య ఆత్మహత్య

మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం.. పలువురు అమ్మాయిల అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

తర్వాతి కథనం
Show comments