Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ "ఓజీ" : 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' అంటున్న నేహాశెట్టి

ఠాగూర్
బుధవారం, 1 అక్టోబరు 2025 (10:21 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజీత్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ఓజీ. గత నెల 25వ తేదీన విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ఇప్పటికే రూ.300 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. అయితే, ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీలో ప్రత్యేక గీతాన్ని మంగళవారం రాత్రి నుంచి జోడించారు. 
 
'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' అంటూ సాగే ఈ గీతాన్ని మంగళవారం రాత్రి షో నుంచి అటాచ్ చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది. ఈ ప్రత్యేక గీతంలో హీరోయిన్ నేహాశెట్టి నర్తించింది. అయితే, ఈ సినిమా విడుదలకు ముందు ఈ పాట వివరాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనప్పటికీ.. రూమర్స్ రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 
 
అనివార్య కారణాల వల్ల సినిమా నుంచి ఈ పాటను తొలగించిన చిత్ర బృందం.. ఆ సర్‌ప్రైజ్‌ను ఇప్పుడు ఇచ్చింది. సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.154 కోట్లకుపైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 25న విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.252 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్టు టీమ్ మంగళవారం వెల్లడించింది. 
 
అలాగే, బుధవారం సాయంత్రం చిత్ర విజయోత్సవాన్ని నిర్వహించనున్నట్టు తాజాగా తెలిపింది. వేదిక వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఈ ఈవెంట్‌కు పవన్ కూడా హాజరుకానున్నారని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం

అత్యాచారం చేసాక బాధితురాలిని పెళ్లాడితే పోక్సో కేసు పోతుందా?

Monsoon: దేశ వ్యాప్తంగా 1,528 మంది మృతి.. ఆ మూడు రాష్ట్రాల్లోనే అత్యధికం..

Cocaine: చెన్నై ఎయిర్ పోర్టులో రూ.35 కోట్ల విలువైన కొకైన్‌.. నటుడి అరెస్ట్

తమిళనాడుకు ఏమైంది, మొన్న తొక్కిసలాటలో 41 మంది మృతి, నేడు ఎన్నూరులో 9 మంది కూలీలు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments