Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21-09-2025 నుంచి 27-09-2025 వరకు మీ వార రాశిఫలితాల

Advertiesment
weekly horoscope

రామన్

, ఆదివారం, 21 సెప్టెంబరు 2025 (00:13 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్థికస్థితి నిరాశాజనకం. ఖర్చులు అదుపులో ఉండవు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. పనులు మందకొడిగా సాగుతాయి. ఆదివారం నాడు ప్రముఖుల కలయిక వీలుపడదు. మొండిగా ముందుకు సాగుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. గృహమార్పు అనివార్యం. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య అవగాహనలోపం. న్యాయనిపుణులను సంప్రదిస్తారు. రాజీమార్గంలో సమస్య పరిష్కారమవుతుంది. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ధనలాభం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. సన్మాన, సంస్కరణ సభల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు నిర్విరామంగా సాగుతాయి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వాల స్వీకరణకు తగిన సమయం. వ్యాపకాలు అధికమవుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. సోమవారం నాడు ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఉద్యోగస్తుల పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆలయాలకు కానుకలందిస్తారు. దైవదర్శనాలు మానసికోల్లాసం కలిగిస్తాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గ్రహసంచారం బాగుంది. కీలక విషయాలపై పట్టుసాధిస్తారు. లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం కొందరికి అపోహ కలిగిస్తుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. బుధవారం నాడు చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. క్రమం తప్పకుండా ఔషధ సేవనం పాటించండి. ఉపాధ్యాయులకు పదోన్నతి ఉత్వర్వులు అందుతాయి. సహోపాధ్యాయులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. అధికారులకు హోదామార్పు. దైవదర్శనంలో అవస్థలు తప్పవు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ధృఢసంకల్పంతో అడుగు ముందుకేయండి. ఓర్పుతో శ్రమిస్తేనే కార్యం సిద్ధిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం గ్రహిస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. సన్నిహితులతో తరచు సంభాషిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. శుక్రవారం నాడు ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయటం శ్రేయస్కరం. మీ అభిప్రాయాలను సూచనప్రాయంగా తెలియజేయండి. సంతానం కృషి ఫలిస్తుంది. దూరపు బంధువులతో తరచు సంభాషిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. విదేశీ సందర్శనలకు సన్నాహాలు సాగిస్తారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్ధికంగా ఫర్వాలేదు. ఖర్చులు తగ్గించుకోవటం శ్రేయస్కరం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. చిట్స్, ఫైనాన్స్ రంగాల జోలికి పోవద్దు. గురువారం నాడు చేసిన పనులే చేయవలసి వస్తుంది. చీటికిమాటికి అసహనం చెందుతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. మీ మాటతీరు వల్ల కొన్ని అవకాశాలు చేజారిపోతాయి. దంపతుల మధ్య దాపరికం తగదు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు అస్తవ్యస్తంగా సాగుతాయి. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. వస్త్ర, బంగారు వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహపరుస్తాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లక్ష్యసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. వీలైనంత వరకు మితంగా సంభాషించండి. ఆలస్యంగానైనా పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరుతాయి. శనివారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. స్థిరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. సన్నిహితులకు మీ సమస్య తెలియజేయండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఆప్తులను విందులు, వేడుకకు ఆహ్వానిస్తారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
గ్రహబలం సామాన్యంగా ఉంది. వ్యవహార ఒప్పందాల్లో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీస్తాయి. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు. ఖర్చులు విపరీతం. చిన్న చిన్న అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపులను ఆశ్రద్ధ చేయండి. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. ఆశావహదృక్పథంతో ముందుకు సాగుతారు. కలిసివచ్చిన అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఆది, సోమవారాల్లో అవసర విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యాఖ్యలు వివాదాస్పదం కాకుండా చూసుకోండి. కీలక పత్రాలు అందుకుంటారు. ఉద్యోగ బాధ్యతల పట్ల దృష్టిపెట్టండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. హోల్సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ యత్నాలకు అదృష్టం తోడవుతుంది. అవకాశాలు కలిసివస్తాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. మీ నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేయండి. బుధవారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. శకునాలు పట్టించుకోవద్దు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. శుభకాకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధుమిత్రులతో గృహం కళకళలాడుతుంది. పెద్దల ఆశీస్సులందుకుంటారు. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభం గడిస్తారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కష్టకాలం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉత్సాహంగా శ్రమించండి. పరిస్థితులు కలిసివస్తాయి. ధనలాభం ఉంది. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. అందరితోనూ మితంగా సంభాషించండి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయండి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. శనివారం నాడు ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు. నిరుద్యోగులకు సదావకాశం లభిస్తుంది. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు సన్నాహాలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవీయోగం. విందులకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ వారం కొంత మేరకు అనుకూలం. పెద్దల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు, కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. స్థిరచరాస్తుల వ్యవహారం పునరానలోచించండి. సంతానానికి శుభపరిణామాలున్నాయి. ఆప్తులతో తరుచుగా సంభాషిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పెట్టుబడులకు తరుణం కాదు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సంకల్పబలం కార్యోన్ముఖులను చేస్తుంది. ఆత్మస్థైర్యంతో శ్రమించి లక్ష్యానికి చేరువవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధనసమస్యలు తలెత్తకుండా చూసుకోండి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురైనా పూర్తిచేయగల్గుతారు. మీ విషయాల్లో ఇతరుల ప్రమేయానికి అవకాశమివ్వవద్దు. నగదు, వెండి బంగారాలు జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివాహయ సంబంధం కుదిరే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియజేయండి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. అధికారుల తీరును గమనించి మెలగండి. వ్యాపారాల్లో పురోగతతిన సాగుతాయి. మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసిద్ధికి సంకల్పబలం ప్రధానం. పరిచయస్తుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మనోబలంతో ముందుకు సాగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం గ్రహిస్తారు. బుధవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య స్వల్ప కలహం. సామరస్యంగా మెలగండి. పెద్దల చొరవతో సమస్య సానుకూలమవుతుంది. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వస్త్ర వ్యాపారాలు జోరుగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగస్తులకు పదోన్నతి. సన్మాన, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహాలయ అమావాస్య నాడు ఇవి దానం చేస్తే పితృ దేవతలు సంతృప్తి