మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంకల్పదీక్షతో శ్రమిస్తేనే కార్యం సిద్ధిస్తుంది. ఏకాగ్రతతో పనులు చేయండి. యత్నాలు విరమించుకోవద్దు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. రాబడిపై దృష్టిపెడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. మీ ఇబ్బందులను ఆప్తులకు తెలియజేయండి. బుధవారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. గృహమరమ్మతులు చేపడతారు. పక్కవారి నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సానుకూలమవుతుంది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సమయపాలన ముఖ్యం. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. పెట్టుబడులు కలిసిరావు. సరుకు నిల్వలో జాగ్రత్త.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. సన్నిహితులకు సాయం అందిస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిఉస్తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. శుక్రవారం నాడు ఇతరుల విషయతంలో జోక్యం తగదు. మీ వ్యాఖ్యలను కొందరి వక్రీకరిస్తారు. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. విదేశాల నుంచి సంతానం రాక ఉత్సాహం కలిగిస్తుంది. ఆత్మీయులతో తరుచు సంభాషిస్తారు. కావలసిన వస్తువులు సమయానికి కనిపించవు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. సేవా కార్యక్రమంలో పాల్గొంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ వారం గ్రహాస్థితి బాగుంది. ఇష్టపడి శ్రమించి కార్యం సాధిస్తారు. లావాదేవీలు సంతృప్తినిస్తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. చిట్స్, ప్రైవేట్ ఫైనాన్సుల జోలికి పోవద్దు. సంస్థల స్థాపనలకు అనుకూలం. అర్థాంతగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య స్వల్ప కలహం. సామరస్యంగా మెలగండి. ఏ విషయాన్నీ పెద్దది చేసుకోవద్దు. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. అవివాహితులను శుభయోగం. ఆరోగ్యం జాగ్రత్త. క్రమం తప్పకుండా ఆహార నియమాలు పాటించండి. ఉపాధ్యాయులకు పదవీయోగం, ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లక్ష్యం సాధించే వరకు శ్రమించండి. ఏకాగ్రతతో కృషి చేస్తే సంకల్పం నెరవేరుతుంది. పెద్దల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఆదాయ వ్యయాలు పొంతన ఉండదు. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ప్రముఖులకు చేరువవుతారు. వ్యతిరేకులతో జాగ్రత్త. పొగిడే వారి ఆంతర్యం గ్రహించండి. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ముఖ్యమైన పత్రాలు చేతికందుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. అవకాశాలను వదులుకోద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారారులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. దైవకార్యం, విందుల్లో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. చేపట్టిన పనుల్లో ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయటం శ్రేయస్కరం. ఖర్చులు అదుపులో ఉండవు. ఆకస్మిక ఖర్చులు ఎదురవుతాయి. ధనం మితంగా ఖర్చు చేయండి. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. శనివారం నాడు దంపతుల మధ్య సఖ్యత లోపం. చీటికిమాటికి అసహనం చెందుతారు. సామరస్యంగా మెలగండి. సంతానం ఉద్యోగయత్నం ఫలిస్తుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. వృత్తి ఉపాధి పథకాల్లో అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు పదవీయోగం. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. బిల్డర్లు, పనివారలకు కష్టసమయం.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వీదైన రంగంలో శుభపరిణామాలున్నాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. అర్థాంతంగా ముగించిన పనులు పూర్తిచేస్తారు. సోమవారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. కీలక వ్యవహారాల్లో తొందరపాటు తగదు. పెద్దల సలహా పాటించండి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. గృహమార్పు అనివార్యం. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. మీ సహోద్యోగులతో జాగ్రత్త. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. కీలక సమావేశంలో పాల్గొంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థికస్థితి నిరాశాజనకం. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అన్యమస్కంగా గడుపుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలు, చేబదుళ్లు తప్పకపోవచ్చు. బుధవారం నాడు కొందరి రాక చికాకుపరుస్తుంది. మొండిగా పనులు పూర్తి చేస్తారు. సన్నిహితులతో సంభాషిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. గృహనిర్మాణం పూర్తికావస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. ఔషధసేవనం క్రమం తప్పకుండా పాటించండి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఓర్పు ముఖ్యం. వ్యాపారాభివృద్ధికి పథకాలు చేపడతారు. న్యాయ, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
గ్రహయోగం అనుకూలంగా ఉంది. ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. చిట్స్, ప్రైవేట్ ఫైనాన్సు వ్యాపారాల జోలికి పోవద్దు. మంగళవారం నాడు అవగాహన లేని విషయాల జోలికి పోవద్దు. అనుభవజ్ఞులను సంప్రదిస్తారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి. అధికారులకు హోదామార్పు. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆశావహదృక్పధంతో మెలగండి. పట్టుదలతో శ్రమిస్తేనే కార్యం సిద్ధిస్తుంది. సాయం ఆశించవద్దు. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. అర్థాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. గురువారం నాడు అందరితోను మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. సంతానం విజయం సంతోషంత కలిగిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను తట్టుకుంటారు. మీ పథకాలు, షాపుల స్థలమార్పు కలిసివస్తాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ఉపాధ్యాయులకు పదోన్నతి, పురస్కారయోగం.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీ పట్టుదలతో కృషి చేస్తేనే కార్యం సిద్ధిస్తుంది. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. విమర్శలు, అభియోగాలు పట్టించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. స్థిరాస్తి ధనం అందుకుంటారు. ఖర్చులు సామాన్యం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వివాహయత్నం ఫలిస్తుంది. పెట్టిపోతల్లో జాగ్రత్త. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ధార్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యం సాధించే వరకు శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచికే. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. శనివారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనలతో సతమతమవుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆపత్సమంలో సన్నిహితులు చేయూతనిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. నూతన పెట్టుబడులకు అనుకూలం. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసిద్ధికి మరింత శ్రమించాలి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. సోమవారం నాడు ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.