పవన్ కళ్యాణ్ సమయం ప్రారంభం - ఓజీ.. టైమ్ బిగిన్స్ తో కొత్త పోస్టర్

డీవీ
మంగళవారం, 4 జూన్ 2024 (13:20 IST)
OG times begins
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా ఓజీ. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో అమితాబ్ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా కోసం కొత్త న్యూస్ ను జులై 4 న ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే తెలిపింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ హవా చాటుతున్న తరుణంలో నేడు  ఓజీ.. టైమ్ బిగిన్స్.. అంటూ పవన్ కళ్యాణ్ టైమ్ వచ్చేసింది అన్నట్లుగా పోస్టర్ విడుదల చేశారు.
 
దీనికి ఇప్పటికే అభిమానుల్లో పెద్ద ఆసక్తి రేకెత్తించింది. ఓ జీ.. ఎవ్వరికి అంధదు అథాని రేంజ్...  రెప్ప తెరిచేను రగిలే పగ... అంటూ చిన్న క్యాప్షన్ కూడా జోడించారు. దర్శకుడు సుజిత్ ఈ సినిమాలో పలువురుని ఎంపిక చేశాడు. ఇప్పటికే ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుల్ మోహన్, శ్రియారెడ్డి, సీనియర్ నటుడు వెంకట్ తదితరులు నటిస్తున్నారు.
 
250 కోట్లకు పైగా బడ్జెట్ తో ఓజీని రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇటీవలే హరిహర వీరమల్లు సినిమా షూట్ త్వరలో చేయబోతున్నట్లు నిర్మాత ఎ.ఎం. రత్నం తెలిపారు. మరి ఓజీ కి పవన్ టైం కేటాయిస్తాడో.. ఆంధ్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన పవన్ షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇస్తాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ప్రకటించిన సీఎం చంద్రబాబు

వయాగ్రా మాత్రలు కూరలో కలిపింది.. చివరికి శృంగారం చేస్తుండగా భర్త చనిపోయాడని?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక

డయల్ బిఫోర్ యు డిగ్ అని కోరుతున్న థింక్ గ్యాస్

ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా?: కామాంధుడికి దేహశుద్ధి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments