Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ కథానాయకుడు, 100 థియేటర్లలో ఎన్టీఆర్ 100 విగ్రహాల ఏర్పాటు..! (video)

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (15:13 IST)
మహానుభావుడు, మహానటుడు నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న విడుదల కానుంది. ఈ క్రమంలోనే సరికొత్త ఐడియాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఎన్టీఆర్ చిత్ర యూనిట్. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఎంపిక చేసిన 100 థియేటర్లలో ఎన్టీఆర్ 100 విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. 
 
తొలి విగ్రహాన్ని నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నందమూరి కళ్యాణ్ రామ్ తిరుపతి పీజేఆర్ థియేటర్లో మంగళవారం విడుదల చేయనున్నారు. 
 
జనవరి 7, 8 తేదీల్లో నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నిమ్మకూరు, బెంగళూరు, తిరుపతి వెళ్లి కథానాయకుడు ప్రమోషన్లో పాల్గొననున్నారు. 
 
ఆ తర్వాత విగ్రహం విడుదల చేయనున్నారు బాలయ్య, విద్యాబాలన్. ఈ కార్యక్రమం తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు ఎన్టీఆర్ చిత్ర యూనిట్. ఎన్టీఆర్ బయోపిక్‌లో తొలిభాగం ఎన్టీఆర్ కథానాయకుడును దర్శకుడు క్రిష్ తెరకెక్కించారు. 
 
నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గుపాటి, సుమంత్, ప్రకాష్ రాజ్, నరేష్ vk, మురళీ శర్మ, జిష్షు సేన్ గుప్తా, నిత్యా మీనన్, రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుబాటి రాజా, కైకాల సత్యనారాయణ త‌దిత‌రులు న‌టించారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments