Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ ఎన్టీఆర్ భార్యకు భారీ పారితోషికం...

స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా, నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (15:10 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా, నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
అయితే, ఈ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణిగా అంటే బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తోంది. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. స్టార్ ఇమేజ్ ఉన్న విద్యాబాలన్ సాధారణంగానే సినిమాకు ఎక్కువ పారితోషకం తీసుకుంటారనే విషయం తెలిసిందే. కానీ ఎన్టీఆర్ సినిమా విషయంలో మాత్రం ఆ పారితోషకం భారీ స్థాయిలో కాదట అతి భారీ స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం మేరకు విద్య సుమారు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశారని, చిత్ర నిర్మాతలు కూడ ఆమె నటనా ప్రావీణ్యాన్ని, స్టార్ స్టేటస్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ మొత్తం ఇచ్చేందుకు అంగీకరించారని తెలుస్తోంది. దీన్నిబట్టి బాలకృష్ణ, క్రిష్‌లు సినిమాను ఏ స్థాయిలో రూపొందిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాకినాడలో ప్రేమజంట మృతి.. రైల్వే ట్రాక్ వద్ద ప్రేయసిని ప్రియుడు హత్య చేశాడా?

కాళేశ్వరం మూడు బ్యారేజీలను మరమ్మతు చేసేందుకు తెలంగాణ సన్నాహాలు

హైదరాబాద్ సిటీ కాలేజీలో పైథాన్ కలకలం.. (వీడియో)

భర్త మరో స్త్రీతో ఎఫైర్: కాల్ రికార్డ్, లొకేషన్ తెలుసుకునే హక్కు భార్యకు వుందన్న హైకోర్టు

భార్య మీద అలిగిన ఓ భర్త కరెంట్ స్తంభం ఎక్కాడు, ఆ తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments