Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్చం అన్నగారిలాగే.. పంచెకట్టులో... ఆవేశంగా బాలయ్య

Webdunia
ఆదివారం, 2 డిశెంబరు 2018 (11:39 IST)
స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". 'కథానాయకుడు', 'మహానాయుకుడు' అనే పేర్లతో రెండు భాగాలుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో పలు పాత్రల కోసం అనేక మంది నటీనటులను ఎంపిక చేస్తున్నారు. సంక్రాంతికి విడుదలకానున్న ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్‌ను అపుడపుడూ చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తూ వస్తోంది. 
 
ఈ క్రమంలో తాజాగా మరో పోస్టర్ వచ్చేసింది. పంచె కట్టులో బాలయ్య ఆవేశంగా నడుచుకుంటూ వస్తున్నారు. ఈ పోస్ట‌ర్ చూస్తుంటే అచ్చం అన్న‌గారిని తలపించారని ఫ్యాన్స్ అంటున్నారు. తండ్రి పోలిక‌లే కాదు.. తండ్రి హావ‌భావాలు కూడా దించేశారని బాల‌య్యను ప్రశంసిస్తున్నారు‌.
 
ముఖ్యంగా పంచెక‌ట్టులో బాల‌య్య అదుర్స్ అనిపించారని, అన్న‌గారిని గుర్తు చేశారని కితాబిస్తున్నారు. ఒక‌ప్పుడు ఎన్టీఆర్‌ను చూడ‌ని వాళ్ల‌కు ఇప్పుడు బాల‌య్య‌ను చూస్తుంటే అలాగే ఉంటాడేమో అనిపిస్తుందని పొగుడుతున్నారు. ఇందులో ఎన్టీఆర్ భార్యగా విద్యాబాలన్ నటిస్తోంది. 
 
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి, బాలకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మొదటిభాగం వచ్చే యేడాది జనవరి 9వ తేదీన, రెండో భాగాన్ని అదే నెలలో విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గదికి రప్పించుకుని.. నగ్న ఫోటోలు తీసి?

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ.. ప్రమాణ స్వీకారంకు సర్వం సిద్ధం

వంట విషయంలో భర్తతో గొడవ.. చెరువులో చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య (video)

Rooster: మూడు గంటలకు కోడి కూస్తోంది.. నిద్ర పట్టట్లేదు.. ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఎక్కడ?

26 ఏళ్ల వ్యక్తి కడుపులో పెన్ క్యాప్.. 21 సంవత్సరాల క్రితం మింగేశాడు.. ఇప్పుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments