మనసావాచా నిర్వర్తిస్తా.. మాటిస్తున్నా: డైరెక్ట‌ర్ క్రిష్‌..!

ఎన్టీఆర్‌ బయోపిక్ దర్శకత్వ బాధ్యతల్ని మనసావాచా కర్మణా నిర్వర్తిస్తానని దర్శకుడు క్రిష్‌ మాటిచ్చారు. ఈ చిత్రంలో నందమూరి తారక రామారావుగా బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. తేజ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న తర్వాత ఎవరు ఆ బాధ్యతల్ని నిర్వర్తిస్తారు? అని

Webdunia
సోమవారం, 28 మే 2018 (21:37 IST)
ఎన్టీఆర్‌ బయోపిక్ దర్శకత్వ బాధ్యతల్ని మనసావాచా కర్మణా నిర్వర్తిస్తానని దర్శకుడు క్రిష్‌ మాటిచ్చారు. ఈ చిత్రంలో నందమూరి తారక రామారావుగా బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. తేజ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న తర్వాత ఎవరు ఆ బాధ్యతల్ని నిర్వర్తిస్తారు? అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే దీనికి తెరదించుతూ చిత్ర బృందం ప్రకటన విడుదల చేసింది. క్రిష్‌ సినిమాను తెరకెక్కిస్తారని పేర్కొంది.
 
ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్‌ సోషల్‌ మీడియా వేదికగా బాలకృష్ణకు ధన్యవాదాలు చెప్పారు. ‘నన్ను నమ్మి ఇంత బాధ్యత నాకు అప్పగించిన బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. ఇది కేవలం ఒక సినిమా బాధ్యత కాదు. ప్రపంచంలోని తెలుగు వాళ్లందరి అభిమానానికి, ఆత్మాభిమానానికి అద్దం పట్టే బాధ్యత. మనసా వాచా కర్మణా నిర్వర్తిస్తానని మాటిస్తున్నాను’ అని పోస్ట్‌ చేశారు. 
 
క్రిష్‌ ప్రస్తుతం ‘మణికర్ణిక’ సినిమా పనుల్లో ఉన్నారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ నటిస్తున్నారు. ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ సినిమా కథ అందించారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎప్పుడు ప్రారంభించేది త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments