Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ 'ఖుషీ' 27సార్లు చూశా: 'రాజుగాడు' దర్శకురాలు సంజన

డాక్టర్‌ కాబోయే ఏక్టర్‌ అయ్యాననేది ఇండస్ట్రీ తరచూ వినపడే మాటే. లెక్చరర్‌ నుంచి నటులు అయినవారూ వున్నారు. ఇక లెక్కల మాస్టార్‌ నుంచి దర్శకుడయినవారిలో సుకుమార్‌ ఒకరు. ఇప్పుడు అదే కోవలో మరో దర్శకురాలు వచ్చింది. తనే సంజన. రామ్‌గోపాల్‌ వర్మ దగ్గర శిష్యరికం

Webdunia
సోమవారం, 28 మే 2018 (21:19 IST)
డాక్టర్‌ కాబోయే ఏక్టర్‌ అయ్యాననేది ఇండస్ట్రీ తరచూ వినపడే మాటే. లెక్చరర్‌ నుంచి నటులు అయినవారూ వున్నారు. ఇక లెక్కల మాస్టార్‌ నుంచి దర్శకుడయినవారిలో సుకుమార్‌ ఒకరు. ఇప్పుడు అదే కోవలో మరో దర్శకురాలు వచ్చింది. తనే సంజన. రామ్‌గోపాల్‌ వర్మ దగ్గర శిష్యరికం చేసింది. తాజాగా రాజ్‌ తరుణ్‌తో 'రాజుగాడు' చిత్రానికి దర్శకత్వం వహించింది. జూన్‌ 1న విడుదల కానున్న తన చిత్రం గురించి ఆమె పలు విషయాలను ఈ విధంగా వెల్లడించారు.
 
టీచర్, జర్నలిస్ట్... ఇప్పుడు దర్శకురాలిగా... ఎలా వుంది జర్నీ?
చిన్నతనం నుండి టివీ, సినిమాలు చూడటం అలవాటు. అదే పనిగా సినిమాలు చూసే దాన్ని. అలా చిన్నప్పటి నుండి సినిమా అంటే ఇష్టం పెంచుకున్నా. పుట్టి పెరిగింది టెక్కలి (శ్రీకాకుళం జిల్లా). ఆంధ్రా యూనివర్సిటిలో ఎం.ఎస్‌.సి మ్యాథమేటిక్స్‌ పూర్తిచేసి కొన్నాళ్ళు మ్యాథ్స్‌ టీచర్‌గా పని చేశా. ఆ తర్వాత నేర్చుకున్నదే చెప్పడం బోర్‌గా ఫీలయ్యి హైదరాబాద్‌ వచ్చి ఐటీలో ఉద్యోగం చేశా. ఆ తర్వాత జర్నలిస్టుగా ఛానల్స్‌లో పనిచేశా. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాను. దర్శకురాలినయ్యా.
 
పవన్ కళ్యాణ్ సినిమా అంటే అంత ఇష్టమా?
నేను పదేపదే చూసిన సినిమాల్లో 'ఖుషి' మొదటిస్థానంలో ఉంటుంది. ఏప్రిల్‌ 27న విడుదలైన ఆ సినిమాను 27 సార్లు చూశా. రోజు థియేటర్‌‌కెళ్ళి సినిమా చూడటమే పనిగా పెట్టుకునేవాళ్ళం. ఆ సినిమాలో ప్రతీ సన్నివేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేదాన్ని. దర్శకురాలిగా మారడానికి ఆ సినిమా కూడా ఒక కారణమే.
 
దర్శకత్వం చేయాలని ఎలా?
ప్రాక్టీస్‌ కన్నా చిన్నతనం నుండి చూసిన సినిమాల నుండే ఎక్కువ నేర్చుకున్నా. ఆ అనుభవం నా మొదటి సినిమాకి బాగా కలిసొచ్చింది. డైరెక్షన్‌ చేద్దామన్న ఆలోచన రాకముందే కొన్ని వాణిజ్య ప్రకటనలు చేశా. అమల గారితో చేసిన ప్రకటనకు మంచి ఫలితం వచ్చింది. ఆ తర్వాత మూవీ డైరెక్ట్‌ చేద్దామని ఫిక్స్‌ అయ్యాను. ఆ టైంలో వేరేవాళ్ళు రాసిన కథలు కూడా విన్నా. కానీ అంత ఆసక్తి కల్గించలేదు. ఫైనల్‌గా క్లేప్టోమేనియా (నచ్చింది తస్కరించే అలవాటు) కాన్సెప్ట్‌ అనుకొని కొంత మంది రచయితలతో స్క్రిప్ట్‌ ఫినిష్‌ చేసి సినిమా చేశా.
 
రాజ్ తరుణ్‌తో చేయాలని ఎందుకు అనుకున్నారు?
కథలు వినడం కోసం ఒక ఆఫీస్‌ తీసుకున్నాం. అప్పుడు రాజ్‌ తరుణ్‌ 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఆఫీస్‌ మా ఆఫీస్‌ పక్కన కావడంతో అలా రాజ్‌ తరుణ్‌ పరిచయం అయ్యాడు. అప్పటి నుండి రాజ్‌ తరుణ్‌ నేను స్నేహితులయిపోయాం. ఇద్దరం కలిసి స్క్రిప్ట్‌ గురించి చర్చించుకునేవాళ్ళం. అలా పుట్టిన కథను నిర్మాత అనిల్‌గారిని వినిపించడం, ఆయనకి నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్‌ రెడీ చేయించారు. అలా ఏకే ఎంటర్తైన్మెంట్స్‌లోనే ఈ కథ సిద్ధమైంది. 
 
రాజ్‌ తరుణ్‌ వల్లే అనిల్‌ పరిచయం అయ్యారు. అనిల్‌ సపోర్ట్‌తోనే సినిమా ఇంతవరకూ వచ్చింది. ఆయన షూటింగ్‌కి వచ్చింది ఒకే ఒక్కసారి మాత్రమే. ఆరోజు కొన్ని సీన్స్‌ చూసి అంతా మా మీద వదిలేసి కూల్‌గా వెళ్ళిపోయారు. అప్పటి నుండి మళ్ళీ సెట్‌లో అడుగుపెట్టిందే లేదు. ఫైనల్‌ అవుట్‌‌పుట్‌ చూసి ఆయన చాలా హ్యాపీగా ఫీలయ్యారు.
 
టీజర్ రిలీజ్ అయిన తర్వాత వేరే చిత్రాలను చూసి అలా చేశారంటూ వస్తున్న కామెంట్లపై...
ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ అయినప్పటి నుండి అందరూ ఇది ఏదైనా సినిమా నుండి ఆదర్శంగా తీసుకొని చేశామనుకుంటున్నారు. కానీ ఇది ఏ సినిమాను ఆదర్శంగా తీసుకొని చేసిందికాదు. సూర్య నటించిన 'మేము' సినిమాలో క్లేప్టోమేనియా డిసార్డర్‌తో ఓ క్యారెక్టర్‌ ఉందని విన్నాను. కానీ ఇంతవరకూ నేను ఆ సినిమా చూడలేదు.
 
ఆర్జీవి దగ్గర అసిస్టెంటుగా పనిచేస్తున్నప్పుడు ఎలా అనిపించింది?
నేను పనిచేసిన ఒకే ఒక్క సినిమా 'రౌడీ'. అనుకోకుండా రాంగోపాల్‌ వర్మ గారి దగ్గర ఆ సినిమాకు కొన్ని రోజులు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేయడం జరిగింది. ఆ టైంలో అందరూ రౌడీ సంజన అంటుండేవారు. చేసింది తక్కువ రోజులే అయినప్పటికీ రాముగారి దగ్గర సినిమా మేకింగ్‌ గురించి చాలా విషయాలు నేర్చుకున్నా. అయితే అనుకోకుండా ఇప్పుడు సరిగ్గా ఆయన సినిమా రిలీజ్‌ అవుతున్న రోజే నా సినిమా కూడా విడుదలవుతుంది. ఇది అనుకోకుండా జరిగింది. ఆయన కూడా 'మనం సేం డే వస్తున్నాం' అంటూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.
 
రాజుగాడు చిత్రం స్టోరీ లైన్ ఏంటి?
క్లేప్టోమేనియా అనే డిసార్డర్‌ ఉన్న కుర్రాడు ఆ సమస్య వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు. తనకు ఎదురైన ఇబ్బందులనుండి ఎలా ఎస్కేప్‌ అవుతూ తన జీవితాన్ని కొనసాగించాడు అనేది సినిమా. సినిమా అంతా సరదాగా ఉంటూనే అందరినీ కొత్తగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఒక్క ముక్కలో  చెప్పాలంటే 'రాజు గాడు' వెరీ స్పెషల్‌గా ఎంటర్‌టైన్‌ చేస్తాడు అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments