Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెన్నుపోటుతో చనిపోయిన ఎన్టీఆర్ మళ్లీ పుట్టారు - లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (11:30 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్రలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
అయితే, ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు లక్ష్మీపార్వతి, చంద్రబాబు పాత్రలనే పరిచయం చేసిన వర్మ.. ఇపుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకే రిలీజ్ చేయాల్సి ఉన్నా... ఎన్టీఆర్‌కు ఉన్న విశ్వాసాల మీద గౌరవంతో ఆయన లక్కీ నెంబర్ 9 కలిసే విధంగా సాయంత్రం 6.57 గంటలకు లక్ష్మీస్ ఎన్టీఆర్‌లోని ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేశాడు. 
 
'వెన్నుపోటు ద్వారా చంపబడిన ఎన్టీఆర్ మళ్లీ లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపంలో బతికి వ‌చ్చారంటూ' వర్మ ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశాడు. అయితే.. ఎన్టీఆర్ పాత్రను పోషించిన వ్యక్తి పేరు మాత్రం డైరెక్టర్ వెల్లడించలేదు. 
 
రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను జీవీ ఫిలింస్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. కళ్యాణ్ మాలిక్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే సినిమాలోని రెండు పాటల్ని వర్మ విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ ఫస్ట్ లుక్ వీడియోను ఇప్పటికే పది లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు, వెంకట సాయి.. (video)

Telangana: భర్తను చెల్లెలి సాయంతో హత్య చేసిన భార్య.. ఎందుకు ?

జనవరి 31 నుంచి అరకు ఉత్సవాలు.. మూడు రోజుల జరుగుతాయ్

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ

కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments