Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం రాత్రి 7.02 నిమిషాలకు "ఎన్టీఆర్ 30" ఫస్ట్ లుక్ రిలీజ్

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (12:52 IST)
హీరో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం "ఎన్టీఆర్ 30". ఎన్టీఆర్‌కు ఇది 30వ చిత్రం కావడంతో ప్రస్తుతం ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తోనే చిత్రీకరణ జరుపుకుంటోంది. 19వ తేదీన అభిమానులకు అదిరిపోయే కానుక లభించనుంది. ఈ చిత్రం నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌ను శుక్రవారం రాత్రి 7.02 నిమిషాలకు విడుదల చేయనున్నారు.
 
ఇప్పటివరకు ఈ సినిమా నుంచి పలు పోస్టర్‌లు వచ్చినా ఎన్టీఆర్ ఫ్రంట్ లుక్ చూపించలేదు. మొత్తానికి ఊర మాస్ సినిమా అని తెలుస్తూనే ఉన్నా, ఎన్టీఆర్ రౌద్ర రూపాన్ని అభిమానులు శుక్రవారం వీక్షించనున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ ట్వీట్ చేసింది. 
 
అతని కంటే అతని కథ మరింత భయానకం అంటూ ఎన్టీఆర్ 30పై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ కథానాయిక. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో ప్రతినాయకుడు అని తెలుస్తోంది. నందమూరి కల్యాణ్ రామ్ ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్... ఎన్టీఆర్ చిత్రానికి తొలిసారి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments