అనుమానాస్పదస్థితిలో బాలీవుడ్ నటి మృతి... మృతదేహం తీసుకోలేమన్న తల్లిదండ్రులు!!

వరుణ్
మంగళవారం, 11 జూన్ 2024 (14:55 IST)
బాలీవుడ్ నటి నూర్ మాలబికా దాస్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఆమె ఉంటున్న ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన కథనం మేరకు.. అస్సాంకు చెందిన నూర్ మాలబికా దాస్.. కెరియర్ దృష్ట్యా ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె ప్లాట్ నుంచి దుర్వాసన రావడాన్ని ఇరుగుపొరుగు వారు గుర్తించి, అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. 
 
దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు తలుపులు పగలగొట్టిలోనికి వెళ్లి చూడగా, ఆమె మృతదేహం పూర్తిగా కుళ్లిపోయే స్థితికి చేరింది. నూర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధాప్య దశలో ఉన్న ఆమె తల్లిదండ్రులు.. ఇటీవలే ముంబైకి వచ్చివెళ్లారు. కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు మళ్లీ రాలేమంటూ సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె స్నేహితుడు, నటుడు అలోక్నాథ్ పాఠక్ ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో అంత్యక్రియలు నిర్వహించారు.
 
నూర్ మాలబికా దాస్ గతంలో ఖతర్ ఎయిర్ వేస్‌‍ ఎయిర్ హోస్ట్రెస్‌గా పనిచేశారు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ముంబైకి వచ్చారు. బాలీవుడ్ ప్రముఖ నటి కాజోల్ నటించిన 'ది ట్రయల్' సిరీస్‌తో పాటు పలు వెబ్ షోల్లో నటించారు. నూర్ మృతిపై 'ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్' విచారం వ్యక్తం చేసింది. మరోవైపు, మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిందే, హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను కోరనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments