Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్ రాబోతుంది

డీవీ
మంగళవారం, 11 జూన్ 2024 (12:19 IST)
Mani - saripoda
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోద శనివారం'లో సూర్య పాత్రలో మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ పవర్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ అడ్రినలిన్‌తో కూడిన యూనిక్ అడ్వంచర్ ని భారీ కాన్వాస్‌పై హై బడ్జెట్‌తో డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
 
తాజాగా మూవీ టీం మ్యూజిక్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసింది. సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్ జూన్ 15 రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. జేక్స్ బిజోయ్ ఈ సినిమా కోసం అద్భుతమైన ఆల్బమ్ కంపోజ్ చేశారు. మేకర్స్ రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ వీడియోలో నాని స్లో మోషన్ లో నడుచుకుంటూ వచ్చి క్లాత్ ని తొలగించాక టేప్ రికార్డ్ రివిల్ కావడం, పవర్ ప్యాక్డ్ మ్యూజిక్ వినిపించడం చాలా క్రియేటివ్, ఇంట్రస్టింగ్ గా వుంది.  
 
ఈ చిత్రంలో నటిస్తుండగా, ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. మురళి జి డివోపీగా పని చేస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.
 
ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

Prakash Raj: బెట్టింగ్ యాప్‌ కేసు.. ఈడీ ముందు హాజరైన ప్రకాష్ రాజ్

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments