Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ డీలర్ కేపీ చౌదరితో లింకు పెట్టొద్దు.. ఎలాంటి సంబంధాలు లేవు : నటి జ్యోతి

Webdunia
ఆదివారం, 25 జూన్ 2023 (15:22 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్‌ దందా కేసులో అరెస్టు అయిన సినీ నిర్మాత కేపీ చౌదరితో తనకు స్నేహం మాత్రమే ఉందని, తమ మధ్య ఎలాంటి డ్రగ్‌ డీలింగ్స్‌ లేవని నటి జ్యోతి క్లారిటీ ఇచ్చారు. నిజానిజాలు తెలుసుకోకుండా తన ఫొటోలు ప్రచురితం చేయొద్దని కోరారు. ఈ మేరకు తాజాగా ఆమె ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్‌ చేశారు.
 
'కేపీ చౌదరి నాకు మంచి మిత్రుడు. మా మధ్య కేవలం పలకరింపులు మాత్రమే ఉండేవి. డ్రగ్స్‌ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఏర్పాటు చేసిన డ్రగ్స్‌ పార్టీలకూ నేను హాజరు కాలేదు. కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. విచారణకు ఒకవేళ నన్ను పిలిస్తే తప్పకుండా వెళ్తా. ఎలాంటి పరీక్షలకైనా రెడీగా ఉన్నా. నేను ఇప్పటివరకూ మత్తుపదార్థాలు వినియోగించలేదు. 
 
నార్కొటిక్‌ టెస్ట్‌కూ రెడీ. అయితే, ఆయన కాల్‌ లిస్ట్‌లో నా పేరు ఉండటంతో పలు మీడియా సంస్థలు నా ఫొటోలు ప్రచురిస్తున్నారు. కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఫొటోలు ఎలా ప్రచురితం చేస్తారు? నాకంటూ ఒక జీవితం లేదా? వాటిని చూసి నా కుటుంబం బాధపడదా? దయచేసి నిజనిజాలు నిర్ధారణ అయిన తర్వాత ఫొటోలు ఉపయోగించండి'  అని జ్యోతి హితవు పలికారు.
 
తెలుగు 'కబాలి' చిత్ర నిర్మాతల్లో ఒకరైన సుంకర కృష్ణప్రసాద్‌ అలియాస్‌ కేపీ చౌదరి ఇటీవల మాదకద్రవ్యాల కేసులో అరెస్టు అయిన విషయం తెల్సిందే. ఈ నెల 14న ఆయన్ని తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన వద్ద నుంచి కొకైన్‌ కొనుగోలు చేసిన వారి జాబితా గూగుల్‌డ్రైవ్‌లో ఉన్నట్టు గుర్తించారు. అలాగే, కేపీ చౌదరి నాలుగు సెల్‌ఫోన్లలో వందల మంది ప్రముఖుల ఫోన్‌ నంబర్లున్నాయి. 
 
వీరిలో సుమారు 20 మందితో నాలుగైదు నెలల నుంచి తరచూ మాట్లాడిన ఫోన్‌కాల్స్‌ వెలుగు చూశాయి. పంజాగుట్టకు చెందిన పుష్పక్‌ క్యాబ్స్‌ యజమాని రతన్‌ రెడ్డి, సినీ నటి అషు రెడ్డి, జ్యోతితో చౌదరి ఎక్కువసార్లు ఫోనులో మంతనాలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే కేపీకి సంబంధించిన డ్రగ్స్‌ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని శనివారం అషు రెడ్డి స్పందించగా.. తాజాగా జ్యోతి క్లారిటీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మణిపూర్ : ఇద్దరు జవాన్లను కాల్చి తనను తాను కాల్చుకున్న జవాను

కొడుకు పడవలో విహరిస్తుంటే తండ్రి వీడియో తీస్తున్నాడు.. ఇంతలో తిమింగలం వచ్చి... వామ్మో (Video)

లోన్ రికవరీ ఏజెంట్‌తో ప్రేమ - పెళ్లి.. తాగుబోతు భర్తకు అలా షాకిచ్చిన భార్య.. (Video)

భార్య పెదాలకు ఫెవిక్విక్ పూసిన భర్త.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!!

పడక సుఖం కోసం అతనికి దగ్గరైంది.. చివరకు అతని వేధింపులతో ప్రాణాలు తీసుకుంది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments