Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ కేసులో ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదు : ఎన్సీబీ

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (17:40 IST)
బాలీవుడ్‌లో వెలుగు చూసిన మాదక ద్రవ్యాల కేసులో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్లకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) క్లీన్ చిట్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఎన్సీబీ స్పందించింది. డ్రగ్స్ కేసులో ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. 
 
కాగా, మాద‌క ద్ర‌వ్యాల కేసులో బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్ర‌ద్ధా క‌పూర్, సారా అలీ ఖాన్‌ల‌తో పాటు కరీష్మా ప్ర‌కాశ్‌, టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌లు ఆరోపణలు ఎదుర్కొంటారు. వీరిని గత వారం ఎన్సీబీ విచారించింది. ఈ విచార‌ణ‌లో న‌లుగురు చెప్పిన స్టేట్‌మెంట్స్‌ని రికార్డ్ చేశారు. 
 
అయితే దీపికాతో పాటు ఆమె మేనేజ‌ర్ క‌రీష్మా ప్ర‌కాశ్‌ల స్టేట్‌మెంట్‌.. ఎన్సీబీ అధికారుల‌కు సంతృప్తిని ఇవ్వ‌డంతో త్వ‌ర‌లోనే వారికి క్లీన్ చీట్ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు పుకార్లు పుట్టుకొచ్చాయి.
 
కొద్ది సేప‌టి క్రితం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు పుకార్ల‌పై స్పందిస్తూ.. ఎన్సీబీ విచారించిన న‌లుగురు హీరోయిన్స్‌కు క్లీన్ చీట్ ఇస్తుంద‌ని వ‌చ్చిన వార్త‌లు అర్థం లేనివి. అందులో వాస్తవం లేదు అని పేర్కొన్నారు. 2017లో జ‌రిగిన వాట్సాప్ చాట్‌లో ప‌లు కోడ్స్‌తో జ‌రిగిన చాటింగ్‌పై దృష్టి పెట్టిన ఎన్సీబీ దీపికా, సారా, ర‌కుల్, శ్ర‌ద్ధా, క‌రిష్మా ప్ర‌కాశ్‌ల‌ను ప‌లు కోణాల‌లో విచారిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments