'ఎన్టీఆర్ కథానాయకుడు' చిత్రానికి ప్రేక్షకుల కరవు... ఫ్రీగా టిక్కెట్ల పంపిణీ.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (12:21 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఎన్టీఆర్ బయోపిక్'. ఈ చిత్రం తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9వ తేదీ బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటించారు. అలాగే, వివిధ పాత్రల్లో నేటి యువతరం నటీనటులు నటించారు.
 
నిజానికి ఒక కొత్త సినిమా విడుదలవుతుందంటే ఆయా హీరోలు, దర్శకులు, హీరోయిన్ల అభిమానులు ఉదయం నుంచే థియేటర్ల వద్ద సందడి చేయడం ఆనవాయితీ. కానీ, 'ఎన్టీఆర్ కథానాయుడు' చిత్రం ప్రదర్శించే థియేటర్ల వద్ద ప్రేక్షకులు లేక వెలవెలపోతున్నాయి. దీంతో బాలయ్య అభిమానులు థియేటర్ల వద్ద ఉచితంగా టిక్కెట్లను పంపిణీ చేస్తున్నారు. 
 
ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఉన్న అలంకార్ థియేటర్‌లో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాను ప్రదర్శించారు. అయితే మొత్తం 400 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ థియేటర్ 200 సీట్లకు మించి నిండలేదు. 
 
దీంతో బాలయ్య అభిమానులు చాలామందికి సినిమా టికెట్లను ఉచితంగా అందజేశారు. దీంతో టికెట్ అందుకున్న ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో కల్యాణ్ రామ్, సుమంత్ నరేశ్, విద్యాబాలన్, నిత్యా మీనన్ కీలక పాత్రల్లో నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sarpanch Post: ఆమెను వివాహం చేసుకున్నాడు.. సర్పంచ్ పదవికి పోటీ చేయించాడు..

సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్తె పెళ్లైన కొన్ని నెలలకే ఆత్మహత్య.. ఏమైంది?

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments