Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహానటి సావిత్రి జీవిత గాథపై సినిమా.. సావిత్రి పాత్రలో నిత్యామీనన్..

అలనాటి సినీతార, మ‌హాన‌టి సావిత్రి జీవిత గాథ సినిమాగా రూపుదిద్దుకోనుంది. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన నాగ అశ్విన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. అశ్వ‌నీద‌త్ నిర్మాత‌గా వ

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (14:35 IST)
అలనాటి సినీతార, మ‌హాన‌టి సావిత్రి జీవిత గాథ సినిమాగా రూపుదిద్దుకోనుంది. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన నాగ అశ్విన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. అశ్వ‌నీద‌త్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. సావిత్రి జీవితంలో తెలియ‌ని కోణాల్ని సృశిస్తూ సాగే ఈ చిత్రంలో ఇంకొంత‌మంది స్టార్ హీరోలు అతిథి పాత్ర‌లు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.
 
బ‌యోపిక్‌ల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్న ఈ కాలంలో… సావిత్రి జీవిత క‌థ‌ని ఎలా తెర‌కెక్కిస్తారో, ఆ చిత్రం ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో. ఈ నేపథ్యంలో ఇన్నాళ్ల పాటు సావిత్రి పాత్ర కోసం అర‌డ‌జ‌ను హీరోయిన్ల పేర్లు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి. అనుష్క‌, విద్యాబాల‌న్, ప‌రిణితీ చోప్రా ఇలా చాలామంది పేర్లు అనుకొన్నారు. 
 
అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే..? సావిత్రి పాత్ర కోసం చివ‌రికి ఆ ఛాన్స్ నిత్య‌మీన‌న్‌కి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల నాగ్ అశ్విన్‌, అశ్వ‌నీద‌త్ ఇద్ద‌రూ నిత్య‌ని క‌ల‌సి క‌థ వినిపించడంతో ఆమె వెంటనే ఆ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పేసిందట. 
 
తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏకకాలంలో తెర‌కెక్కించే ఈ చిత్రాన్ని హిందీలో కూడా అనువదించాలని సినీ యూనిట్ భావిస్తోంది. ఇకపోతే, 2016 డిసెంబరులో సినిమా సెట్స్‌పైకి వస్తుందని, 2017 వేసవికి కానుకగా సినిమా రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments