Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సుల్తాన్' ట్యూబ్‌లైట్ స్టిల్ విడుదల.. రంజాన్‌కు సినిమా..

'సుల్తాన్' తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం 'ట్యూబ్‌లైట్'. 1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం లేహ్ లడఖ్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (14:03 IST)
'సుల్తాన్' తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం 'ట్యూబ్‌లైట్'. 1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం లేహ్ లడఖ్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సల్మాన్ సరసన చైనీస్ నటి జూ జూ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు కబీర్‌ఖాన్ రూపొందిస్తున్నాడు. 
 
గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో విడుదలైన 'ఏక్ థా టైగర్', 'బజరంగి భాయిజాన్' సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి యాక్షన్, అడ్వెంచర్ సినిమాతో వీరిద్దరు మనముందుకు రాబోతున్నారు. కాగా ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని ఓ స్టిల్‌ను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. 
 
అయితే ఆ స్టిల్‌లో సల్మాన్ ముఖం కనిపించకుండా వెనక నుంచి చూపించారు. ఈ పోస్టర్‌లో సల్మాన్ మొహం కనిపించకపోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్నిరంజాన్ కానుకగా విడుదలచేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments