పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కొత్త సినిమాలు ఎనౌన్స్ చేసిన నితిన్..!

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (18:05 IST)
యువ హీరో నితిన్ ప్రస్తుతం భీష్మ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. గ‌త‌కొన్ని రోజులుగా ఈ సినిమా వార్త‌ల్లో నిలుస్తుంది కానీ... ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో ప్ర‌క‌టించ‌లేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా..? అస‌లు ఉందా..? లేదా..? అనే అనుమానాలు కూడా వ‌చ్చాయి. అయితే... నితిన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా భీష్మ ‘సింగిల్ ఫరెవర్’ అనేది ట్యాగ్‌లైన్ అంటూ ఎనౌన్స్ చేసారు. ఇందులో నితిన్ స‌ర‌స‌న‌ రష్మిక మందన హీరోయిన్‌.
 
ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. నితిన్ పుట్టినరోజును (మార్చి 30) పురష్కరించుకుని భీష్మ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. నితిన్ జుట్టు, సన్‌ గ్లాసెస్ కనిపించేలా ఆయన ముఖాన్ని ఇలస్ట్రేట్ చేశారు. కళ్లజోడు, జుట్టుపై అమ్మాయిలు రకరకాల భంగిమలలో నిలుచున్నారు. 
 
ఈ పోస్టర్‌ను నితిన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘అనౌన్స్‌మెంట్ 2.. కొంత విరామం తరవాత మళ్లీ కమర్షియల్ సినిమాతో వస్తున్నాను. భీష్మ పక్కా హిలేరియస్ కమర్షియల్ బొమ్మ. మన సినిమాను ప్రకటించినందుకు థాంక్యూ రష్మిక ‘సార్’! ‘సింగిల్ ఫరెవర్’ అనే ట్యాగ్‌లైన్‌ను పెట్టినందుకు మా అమ్మ మీ అద్దరినీ చంపేయాలనుకుంటోంది. వెంకీ కుడుముల, రష్మిక మందన చంపేస్తారు అని తన ట్వీట్‌లో నితిన్ పేర్కొన్నారు. రష్మిక మందనను ‘సార్’ అని నితిన్ సంభోదించడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. డీకే శివకుమార్‌కు ఆశీస్సులు

భార్య నచ్చలేదు.. భర్తే ఆమెను రూ.50వేలకు స్నేహితులకు అమ్మేశాడు..

నీట్ యూజీ పరీక్ష రద్దు... ఫీజు వాపసు గడువు జూన్ 22కి పెంపు

ఎన్టీఆర్ 103వ జయంతి.. చంద్రబాబు నివాళి.. మహానాడు ఏం టెక్నాలజీ గురూ..

హైదరాబాద్ నగర నడిబొడ్డున ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments