నితిన్, రష్మిక మందన కొత్త చిత్రం

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (14:08 IST)
Nitin, Rashmika Mandana, Venky Kudumula
వెంకీ కుడుముల దర్శకత్వంలో  నితిన్, రష్మిక మందన కాంబినేషన్ లో వచ్చిన ‘భీష్మ’ భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం పూర్తిగా వినోదాల్ని అందించడంతో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్ కి సంబధించిన మంచి సందేశం ఇచ్చింది. తాజాగా వీరి కాంబినేషన్లో కొత్త చిత్రం ఒక ఫన్నీ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు.
 
వీడియోలో నితిన్, రష్మిక మందన, సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ దర్శకుడి కోసం ఎదురు చూస్తారు. వెంకీ కుడుముల వచ్చి లేట్ అయ్యానా? అని అడుగుతాడు.. ముగ్గురు కలసి బాగా..అని చెప్పారు. స్క్రిప్ట్ కూడా బాగా వచ్చిందని చెప్తాడు వెంకీ. ఛలో, భీష్మ లాగా ఈ చిత్రం కూడా వినోదాత్మకంగా ఉంటుందా అని అడిగినప్పుడు.. ఇది వేరేగా ఉంటుందని చెప్పడం ఆసక్తికరంగా వుంది.
 
ఈ సినిమా మరింత వినోదాత్మకంగా, అడ్వంచరస్ గా ఉంటుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రానికి నిర్మాతలు కాగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తాడిపత్రిలో వైకాపా నేత ఆర్సీ ఓబుల్ రెడ్డిపై దాడి - ఉద్రిక్తత

వరకట్నం వేధింపులు.. భర్త ఇంట్లో లేని సమయం చూసి ఉరేసుకుని ఆత్మహత్య

టిక్ టాక్ వీడియోలు పోస్ట్ చేసిన యువతిని కాల్చి చంపేశారు... ఎక్కడ?

High alert: ఎర్రకోట సమీపంలో పేలుడు.. పది మంది మృతి.. హైదరాబాదులో అలెర్ట్

APCRDA: నవంబర్ 14-15 తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సమ్మిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

తర్వాతి కథనం
Show comments