నాగశౌర్యని కెలికిన నితిన్, మళ్లీ మొదటికి వచ్చిన గొడవ

Webdunia
బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (11:50 IST)
నితిన్ - రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం భీష్మ. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌కి ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. ఇటీవల రిలీజైన ఈ సినిమా సక్సస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. నాలుగు రోజులకు దాదాపు 16 కోట్లు కలెక్ట్ చేసి నితిన్ కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసే సినిమాగా నిలవనుంది. ఈ సినిమా సాధించిన విజయాన్ని పురస్కరించుకుని సక్సస్ మీట్ ఏర్పాటు చేసారు.
 
ఈ వేడుకలో నితిన్ మాట్లాడుతూ... టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమా స్పెషల్ మూవీ ఎప్పటికీ గుర్తుంటుంది అన్నారు. అయితే.. దర్శకుడు వెంకీ కుడుముల గురించి చెబుతూ... ఈ కథ నీదే కదా అన్నాడు. అంతా అక్కడ ఉన్న వారందరూ ఠక్కున నవ్వేసారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఛలో సినిమాని వెంకీ కుడుముల తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సస్ తర్వాత నాగశౌర్య ఈ సినిమా కథ తనదే అన్నట్టు చెప్పారు.
 
వెంకీ చెప్పిన స్టోరీ లైన్ బాగోకపోతే తనే ఛలో స్టోరీ లైన్ చెప్పి డెవలెప్ చేయించానని అన్నారు. అప్పటి నుంచి నాగశౌర్యకు, వెంకీ కుడుములకు మధ్య మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నాగశౌర్య తల్లి గిఫ్ట్‌గా ఇచ్చిన కారును సైతం వెంకీ కుడుముల వాడటం లేదు. ఇదే విషయం గురించి నాగశౌర్యని మీడియా అడిగితే జీవితంలో వెంకీతో మాట్లాడను అని చెప్పారు. ఇక వెంకీ కూడా అంతే, నాగశౌర్యతో మాట్లాడడను అన్నారు.
 
ఇలా సీరియస్‌గా వీరిద్దరి మధ్య జరుగుతుంది. అందుకనే ఈ కథ నీదే కదా అని నితిన్ అనగానే... అక్కడ ఉన్న వారందరూ నవ్వేసారు. మరి.. దీని గురించి నాగశౌర్య స్పందిస్తాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

120 కిలోల గంజాయి స్వాధీనం.. ఒడిశా నుండి గంజాయి.. ఉపాధ్యాయుడు, భార్య..?

ఫోర్బ్స్ మ్యాగజైన్ 2025- దేశం నుంచి 100మందికి స్థానం.. ఆరుగురు తెలుగువారికి కూడా ప్లేస్

Jagan: అరెరె.. ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారనుకుంటే.. లండన్‌కి జగన్ జంప్ అయ్యారే..

బంధువు గిందువు జాన్తానై.... మా పార్టీ అభ్యర్థే ముఖ్యం : తలసాని శ్రీనివాస్ యాదవ్

నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడిన ట్రంప్.. షాకిచ్చిన కమిటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

తర్వాతి కథనం
Show comments