Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'అశ్వత్థామ'ను అర్థం చేసుకుంటే ఇలా వుంది... రివ్యూ రిపోర్ట్ (Video)

'అశ్వత్థామ'ను అర్థం చేసుకుంటే ఇలా వుంది... రివ్యూ రిపోర్ట్ (Video)
, శుక్రవారం, 31 జనవరి 2020 (15:49 IST)
చిత్రం - అశ్వత్థామ
స్క్రీన్ ప్లే, దర్శకత్వం - రమణ తేజ
నిర్మాత - ఉషా ముల్పూరి
సంగీతం - శ్రీ చరణ్ పాకాల
కథ - నాగశౌర్య
నటీనటులు - నాగశౌర్య, మెహరీన్, ప్రిన్స్, జిష్ణుసేన్, హరీష్ ఉత్తమన్ తదితరులు
 
విడుదల - 31-01-2020
 
అశ్వత్థామ అనగానే మనకు మహాభారతంలోని పాత్ర గుర్తుకు వస్తుంది. ద్రోణుడికి అత్యంత ప్రియమైనవాడు, మరణం లేనివాడు అయిన అశ్వత్థామ గురించి భారతంలో చాలా వుంది. ఇక ఇప్పుడు నాగశౌర్య తనే కథ రాసుకుని హీరోగా నటించిన ఈ అశ్వత్థామ ఎలా వున్నాడనేది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
 
కథ:
తన చెల్లలు అంటే హీరో(నాగశౌర్య)కి ఎంతో ప్రేమ. ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటుంటాడు. తన చెల్లి అలా చదువుతూ పెరిగి పెద్దయిపోతుంది. ఆమెకి మంచి వరుడిని చూసి పెళ్లి చేసేందుకు నిశ్చితార్థం చేస్తాడు. ఐతే హఠాత్తుగా అదే రోజు రాత్రి తన చెల్లెలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తుండటాన్ని చూసి షాక్ తింటాడు. అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావని ఆమెని అడుగుతాడు. తను గర్భవతిననీ, తన ప్రెగ్నెన్సీకి కారకులు ఎవరో కూడా తనకు తెలియదని చెపుతుంది.

దాంతో తన చెల్లెలు గర్భవతి కావడానికి కారకులు ఎవరన్నది తెలుసుకునేందుకు ప్రయత్నం మొదలుపెడతాడు. ఈ క్రమంలో వైజాగ్‌లో ఇలాగే పలువురు అమ్మాయిలు కిడ్నాప్ కావడం, ఆ తర్వాత వారికి తెలియకుండానే గర్భవతులు కావడం, ఆసుపత్రుల్లో చేరడం వంటివి తన దృష్టికి రావడంతో దాన్ని ఛేదించే పనిలో పడతాడు హీరో. అమ్మాయిలను వారికి తెలియకుండానే గర్భవతులను చేస్తున్న వారు ఎవరు? హీరో వారిని పట్టుకున్నాడా? అనేది మిగిలిన సినిమా. 
 
విశ్లేషణ: నాగశౌర్య సమాజంలో జరుగుతున్న దారుణాలను చూసి ఇలాంటి కథ అయితే రాసుకున్నాడు కానీ దానికి పూర్తిగా న్యాయం చేయలేకపోయాడనిపిస్తుంది. ముఖ్యంగా లవర్ బాయ్ అయిన శౌర్య ఇలాంటి మాస్, థ్రిల్లర్ చిత్రాలు చేయడం ఆయన అభిమానులకు కాస్త నిరుత్సాహం తెప్పించేదే. పైగా ఈ చిత్రం అంతా సీరియస్‌గా సాగడం, కామెడీ, ఇతర వినోదాత్మక అంశాలు పెద్దగా లేకపోవడంతో ఒకింత నిరుత్సాహం అనిపిస్తుంది.

విలన్ పాత్రను బలంగా తీర్చిదిద్దలేకపోయారు. హీరోయిన్ మెహ్రీన్ గ్లామర్ పూర్తిగా వినియోగించుకోలేకపోయాడు దర్శకుడు. మొత్తమ్మీద తడపడుతూ తెరకెక్కించిట్లుంది అశ్వత్థామ. మరి నాగశౌర్య అభిమానులకు ఇది ఎంతమేరకు ఎక్కుతుందో చూడాల్సిందే. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మందులపై విరక్తి వచ్చి అలా చెప్పాను... సూసైడ్‌ వీడియోపై హీరోయిన్ వివరణ