Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

అనుష్క ఆ మాట చెప్పగానే గుండె పగిలినట్లయ్యింది, మెహరీన్

Advertiesment
Anushka Shetty
, శుక్రవారం, 15 నవంబరు 2019 (14:55 IST)
తెలుగు  సినీపరిశ్రమలో యువ హీరోయిన్లలో మెహరీన్ కు ప్రత్యేక స్థానం ఉంది. క్యూట్ లుక్స్‌తో మెహరీన్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. మహానుభావుడు సినిమాలోను, ఎఫ్‌..2 లాంటి సినిమాల్లో హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ చెప్పిన డైలాగ్‌లు తెలుగు ప్రేక్షకులను ఇప్పటికీ నవ్విస్తూనే ఉన్నాయి. 
 
అయితే మెహరీన్ తన నడవడిక.. తన వ్యక్తిత్వం గురించి తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. నేను బాగా అభిమానించే హీరోయిన్లలో మొదటి వ్యక్తి అనుష్క. నేను సినిమాలోకి రాకముందు నుంచి ఆమె సినిమాలను క్రమం తప్పకుండా చూసేదాన్ని. అనుష్కతో కలిసి నేను మహానుభావుడు సినిమా చూశా. బాగా చేశావు అంటూ ఆమె నన్ను పొగిడారు. అప్పుడు నా గుండె వేగంగా కొట్టుకుని పగిలినట్లనిపించింది. అంటే అంత సంతోషమన్నమాట. 
 
ఎంతో గొప్ప హీరోయిన్‌గా, సహజ నటిగా మంచి పేరు సంపాదించుకున్న అనుష్క తన సినిమా బాగుందని చెప్పడం చాలా సంతోషాన్నిచ్చిదంటోంది మెహరీన్. ఎఫ్..2 సినిమా చూసి ఆ సినిమాలో కూడా బాగా చేశావని 100 మార్కులు అనుష్క తనకు వేసిందని.. తన ప్రతి సినిమాను అనుష్క చూడడం.. తనను మెచ్చుకోవడం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనంటోంది మెహరీన్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నన్ను అత్యాచార సన్నివేశంలో నటించమన్నారు.. భయమేసి పారిపోయా..