Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్యా మీనన్‌పై మనసుపడిన బీమ్లా నాయక్‌

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (10:43 IST)
పవర్ స్టార్ పవన కళ్యాణ్, దగ్గుబాటి రానాల కాంబినేషన్‌లో రానున్న చిత్రంలో నిత్యా మీనన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. మలయాళ మూవీ 'అయ్యప్పనుం కోషియం'ను తెలుగులోకి రీమేక్ చేస్తుండగా, ఇందులో ఈ ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటిస్తున్నారు. 
 
అయితే, ఈ సినిమాలో పవన్‌కి జంటగా నటిస్తున్న టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయినట్టు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 
 
పవర్ స్టార్ మరోసారి బీమ్లా నాయక్ అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. రీసెంట్‌గా ఏకే రీమేక్ నుంచి మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేసింది చిత్ర బృందం. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ రివీల్ చేయడంతో అంచనాలు బాగా పెరిగాయి. ప్రస్తుతం ఈ వీడియో ట్రండ్ అవుతోంది. 
 
ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తుండటం విశేషం. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 'భీమ్లా నాయక్' అనే పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో పవర్ స్టార్ నటిస్తున్నాడు. ఆయనకి జంటగా నిత్యా మీనన్ నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments