Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్యతో 'అ'లా మొదలైందంటున్న హీరో నాని

చూడగానే ఆకట్టుకునే ఫేస్‌తో కైపైన చూపుతో యూత్‌ని ఇట్టే ఆకర్షించే మలయాళ కుట్టి నిత్యా మీనన్. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులముందుకు పరిచయమైంది. ఈ మూవీలో నేచురల్ స్టార్ నాని సరసన నటించింది.

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2017 (12:27 IST)
చూడగానే ఆకట్టుకునే ఫేస్‌తో కైపైన చూపుతో యూత్‌ని ఇట్టే ఆకర్షించే మలయాళ కుట్టి నిత్యా మీనన్. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులముందుకు పరిచయమైంది. ఈ మూవీలో నేచురల్ స్టార్ నాని సరసన నటించింది. 
 
అయితే, ఇప్పుడు ఈ జోడీ మరోసారి వెండితెరపై కనిపించనుంది. నాని నిర్మాతగా మారి, తన సొంత సంస్థ వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై ‘అ!’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. కాజల్‌, నిత్యామేనన్‌, రెజీనా, ఈషా రెబ్బా, శ్రీనివాస్‌ అవసరాల, ప్రియదర్శి పులికొండ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను ఇటీవల విడుదల చేసిన నాని.. శనివారం (డిసెంబర్-2)న నిత్యామేనన్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
 
ఇందులో ఆమె సింపుల్ అమ్మాయి పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. టైటిల్‌ ప్రకటించిన తర్వాత ‘అ!’ బృందం విడుదల చేసిన తొలి పోస్టర్‌ ఇది. ఈ సందర్భంగా నాని ‘అలా మొదలైంది నిత్‌‘అ!’తో’ అని ట్వీట్‌ చేశారు. 
 
ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నాని ఓ చేపకి, రవితేజ ఓ మొక్కకి వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నారు. ఈ తరహా సినిమా ఇప్పటి వరకు తెలుగు తెరపైకి రాలేదని నాని అన్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్‌ పూర్తైనట్లు చెప్పారు. ఫిబ్రవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెప్సికో ఇండియా రివల్యూషనరి అవార్డ్స్ 2024: విజేతగా నిలిచిన తెలంగాణ గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్

తిరుపతిలో అన్నమయ్యకి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది ఎవరో తెలిసిపోయింది (video)

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments